Asianet News TeluguAsianet News Telugu

పాన్ వరల్డ్ మూవీలో బ్రహ్మానందం?

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ లో బ్రహ్మనందం నటిస్తున్నట్లు, ఈ మూవీలో కామెడీ పాళ్ళు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 

bramhanadam to play a role in prabhas nag ashwin project k ksr
Author
Hyderabad, First Published Jul 27, 2021, 8:07 AM IST

కమెడియన్ గా స్టార్ హీరోలకు ఏమాత్రం తగ్గని క్రేజ్ బ్రహ్మానందం సొంతం. బడా హీరోల చిత్రాలలో కూడా బ్రహ్మానందం కోసం ఓ సపరేట్ కామెడీ ట్రాక్ దర్శకులు రాసుకుంటారు. ఒకప్పుడు బ్రహ్మానందం లేని సినిమా అంటే ఉండేది కాదు. ఆ మధ్య అనారోగ్యం పాలైన బ్రహ్మానందం కొంచెం గ్యాప్ ఇచ్చారు. అలాగే గతంలో మాదిరి విరివిగా సినిమాలు చేయడం లేదు. 


అయితే ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ లో బ్రహ్మనందం నటిస్తున్నట్లు, ఈ మూవీలో కామెడీ పాళ్ళు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రాజెక్ట్ కె పేరుతో ఇటీవలే షూటింగ్ లాంచ్ కూడా జరిగింది. దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ ఓ కీలక రోల్ చేస్తున్నారు. 


పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ మూవీ అంటూ దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ కోసం బ్రహ్మానందంని తీసుకున్నారన్న మాట గట్టిగా వినిపిస్తుంది. బ్రహ్మానందం నటిస్తే వెండితెరపై నవ్వులు పూయడం ఖాయం. అయితే ప్రాజెక్ట్ కె లో బ్రహ్మానందం నటిస్తున్నారా అనే విషయంపై పూర్తి క్లారిటీ లేదు. 

వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అశ్వినీ దత్ రూ. 500కోట్ల రూపాయల బడ్జెట్ తో ప్రాజెక్ట్ కె నిర్మిస్తున్నారు. ఇది ఓ భారీ సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం మరొక విశేషం. 


 

Follow Us:
Download App:
  • android
  • ios