Asianet News TeluguAsianet News Telugu

‘బ్రహ్మాస్త్రం’ ఫస్ట్ సింగిల్ ‘కుంకుమలా’ ప్రోమో రిలీజ్.. లాంచ్ చేసిన జక్కన్న..

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘బ్రహ్మాస్త్రం’. ఈ మూవీ నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ తెలుగు వెర్షన్ ప్రొమోను మేకర్స్ రిలీజ్ చేశారు. కాగా, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చేతుల మీదుగా ప్రొమో లాంచింగ్ జరిగింది.

Brahmastra Movie first single promo release, SS Rajamouli launched
Author
Hyderabad, First Published May 27, 2022, 6:08 PM IST

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీ చిత్రం `బ్రహ్మాస్త్ర`(Brahmastra). రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌ (Alia Bhatt) జంటగా నటిస్తున్నఈ చిత్రంలో  బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున(Nagarjuna), మౌనీ రాయ్‌ పలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మూడు భాగాలుగా రాబోతుంది. అందులో భాగంగా మొదటి భాగం `బ్రహ్మాస్త్ర పార్ట్ వన్‌ నుంచి తాజాగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ టీజర్ ను రిలీజ్ చేశారు. 

రొమాంటిక్ సాంగ్ ‘కుంకుమలా’ టైటిల్ తో ఫస్ట్ సింగిల్ టీజర్ ను తాజాగా తెలుగు వెర్షన్ లో రిలీజ్ చేశారు. హిందీలో నెల కొందనే రన్బీర్ మరియు అలియా భట్ వెడ్డింగ్ కానుకగా ‘కేసరియా’ టైటిల్ తో రిలీజ్ చేశారు.  అయితే తెలుగు వెర్షన్ సాంగ్ టీజర్ ను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తాజాగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. ‘బ్రహ్మాస్త్రం : పార్ట్ వన్ నుంచి ‘కుంకుమలా’ సాంగ్ ప్రొమోను రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. సెప్టెంబర్ 9న రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలి’ అంటూ ట్వీట్ చేశారు. 

ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో దూసుకుపోతోంది. ఈ రొమాంటిక్ సాంగ్ కు  హిందీలో అమిత్ భట్టాచార్య లిరిక్స్ అందించగా.. తెలుగులో చంద్రబోస్ అద్భుతమైన సాహిత్యం అందించారు. హిందీలో స్టార్ సింగర్ ఆర్జిత్ సింగ్ పాడగా.. తెలుగులో రొమాంటిక్ సాంగ్స్ స్పెషలిస్ట్ సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు. ఐదేండ్ల కింద స్టార్ అయిన ఈ చిత్ర షూటింగ్.. చివరిగా ఈ ఏడాది మార్చిలో పూర్తి చేసుకుంది. రూ.300 కోట్లతో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. హిందీతో పాటు తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios