ఇటీవల కర్నాటకలో జరిగిన ఎన్నికల్లో కమెడియన్ బ్రహ్మానందం.. వైద్య శాఖ మంత్రి సుధాకర్ తరఫున ప్రచారం చేశారు. తాజా ఫలితాల్లో ఆయన ఓటమి చెందారు.
కర్నాటక ఎన్నికల ఫలితాలు తుదిదశకు చేరుకున్నాయి. కాంగ్రెస్‌కి మెజార్టీ కనిపిస్తుంది. అధికార బీజేపీ వెనకంజలో ఉంది. అయితే ఈ ఎన్నికల ఫలితాల్లో హ్యాస్య బ్రహ్మ బ్రహ్మానందానికి పెద్ద షాక్ తగిలింది. కర్నాటకలో తెలుగువారే ఆయనకు పెద్ద షాకివ్వడం గమనార్హం. కర్నాటక ఎన్నికల్లో బ్రహ్మానందం కూడా ప్రచారం చేశారు. ఆయన చిక్ బళ్లాపూర్ అభ్యర్థి ప్రస్తుత వైద్య శాఖ మంత్రి సుధాకర్ గెలుపు కోసం బ్రహ్మి ప్రచారం చేశారు. బీజీపీ పార్టీ అభ్యర్థి సుధాకర్‌ని గెలిపించాలని ఆయన ప్రచారం చేశారు. కానీ తాజాగా విడుదలైన ఫలితాల్లో మంత్రి సుధాకర్ ఓటమి పాలయ్యారు.
అయితే చిక్ బళ్లాపూర్‌లో తెలుగు వారు ఎక్కువగా ఉంటారు. దీంతో తెలుగు స్టేట్స్ లో మంచి ఫాలోయింగ్, క్రేజ్ ఉన్న కమెడియన్ బ్రహ్మానందంతో ప్రచారం చేయిస్తే గెలుపు ఈజీ అవుతుందని బీజీపీ పార్టీ,అభ్యర్థి సుధాకర్ భావించారు. దీంతో ఆయనతో ప్రచారం చేయించారు. గత ఎన్నికల్లోనూ సుధాకర్ తరఫున బ్రహ్మానందం ప్రచారం చేశారు. ఆ టైమ్‌లో ఆయన విజయం సాధించారు. ఈ సారి కూడా గెలుపుని కాంక్షిస్తూ ప్రచారం చేయగా ఓటర్లు షాకిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ ఈశ్వర్ .. సుధాకర్‌పై గెలుపొందారు. సుమారు 11వేలకుపైగా ఓట్ల మెజార్టీతో ప్రదీప్ ఈశ్వర్ విజయం సాధించడం విశేషం.
కర్ణాటక ఎన్నికల్లో బ్రహ్మానందం ప్రచారం... చిక్ బల్లాపూర్ లో రోడ్ షో
దీంతో తెలుగు ఓటర్లు ఇటు బ్రహ్మానందానికి, అటు బీజీపీ మంత్రి సుధాకర్‌కి పెద్ద షాకిచ్చారని చెప్పొచ్చు. 2023 సార్వత్రిక ఎన్నికల్లో కర్నాటకలో బీజీపీ గట్టి దెబ్బ తగిలింది. గతంలో వారు చేసిన అవినీతి కారణంగానే ఈ ఓటమి చవిచూడాల్సి వచ్చిందని స్థానిక ప్రజలు, లీడ్‌లో కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇదిలా ఉంటే ఆ మధ్య తారకరత్న బెంగుళూరులో నారాయణహృదయాలయలో చికిత్స తీసుకునే సమయంలో మంత్రి సుధాకర్ దగ్గరుండి చూసుకున్నారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వెళ్లినప్పుడు కూడా ఆయన దగ్గరుండి చూసుకున్న విషయం తెలిసిందే.
