హాలీవుడ్ లో అత్యధిక సంపాదన కలిగిన నటులలో బ్రాడ్ పిట్ కూడా ఒకరు. ఈ క్రేజీ హీరో ప్రేమ వ్యవహారాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. స్టార్ హీరోయిన్ ఏంజెలినా జోలీతో ప్రేమ, వివాహం ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. బ్రాడ్ పిట్ మొదటి భార్య హాలీవుడ్ నటి జెన్నిఫర్ అనిస్టన్. 2000 సంవత్సరంలో బ్రాడ్ పిట్ ఆమెని వివాహం చేసుకున్నాడు. 

ఐదేళ్లకే ఈ జంట విడిపోయింది. ఆ తర్వాత బ్రాడ్ పిట్ ఏంజెలినా ప్రేమలో పడ్డాడు. కొన్నేళ్ల పాటు వీరిద్దరూ సహజీవనం చేశారు. అనంతరం ఆమెని వివాహం చేసుకున్నాడు. కానీ 2016లో ఏంజెలినా, బ్రాడ్ పిట్ విభేదాలతో విడాకులు తీసుకున్నారు. 

ప్రస్తుతం బ్రాడ్ పిట్ మరో మహిళ ప్రేమలో పడ్డట్లు హాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. సత్ హరి ఖల్సా అనే 50 ఏళ్ల జ్యువెలరీ డిజైనర్ తో బ్రాడ్ పిట్ ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బ్రాడ్ పిట్ వయసు 55 ఏళ్ళు. వీరిద్దరూ కలసి ఉన్న ఫోటోలని హైలైట్ చేస్తూ హాలీవుడ్ మీడియా కథనాలు ప్రచురిస్తోంది. 

ఖల్సా నిడారంబరంగా జీవించడం, ఆమె అందం, ధైర్యం లాంటి అంశాలకు బ్రాడ్ పిట్ ఆకర్షితుడయ్యాడట. వీరిద్దరూ తమ రిలేషన్ ని నెక్స్ట్ లెవల్ కు తీసుకుని వెళ్లే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇక ఖల్సాకు ఇండియాతో కూడా అనుబంధం ఉంది. ఆమె జ్యువెలరీ డిజైనర్ గా అనేక ప్రాంతాల్లో విద్యనభ్యసించింది. ఇండియాలో వివిధ రకాల రత్నాలు, వాటి ప్రత్యేకతల గురించి స్టడీ చేసింది. ఆ క్రమంలో ఖల్సా ఇండియాలోని ఆధ్యాత్మిక విషయాలకు కూడా ఆకర్షితురాలైంది.