ఏపీ ఎన్నికల కోసం టీడీపీ, వైఎస్సార్ సీపీ పార్టీలు పెద్ద ఎత్తున వాణిజ్య ప్రకటనల కోసం ఖర్చుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ యాడ్లు బుల్లితెరపై సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ యాడ్లు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.

దానికి కారణం దర్శకుడు బోయపాటి శ్రీను తన స్టైల్ మాస్ ఎలిమెంట్స్ తో ప్రకటనలను రూపొందించారు. అయితే వీటిపై సెటైర్లు వేసే వారు కూడా ఉన్నారు. సోషల్ మీడియాలో టీడీపీ యాంటీ ఫ్యాన్స్ ఈ యాడ్స్ ని ట్రోల్ చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా.. ఈ ప్రకటనలను రూపొందించడానికి బోయపాటి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడనే విషయంలో ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. కొన్ని రకాల వెర్షన్స్ లో యాడ్స్ ని రూపొందించడానికి మొత్తం రూ.4.5 కోట్ల డీల్ ని కుదుర్చుకున్నాడట బోయపాటి.

ఈ ప్రకటనల కోసం బోయపాటి కొన్ని నెలలుగా శ్రమించారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ఈ ఎన్నికలతో బోయపాటి బాగానేసొమ్ము చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ దర్శకుడు బాలకృష్ణతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.