మాస్ కమర్షియల్ సినిమాలను తెరకెక్కించడంలో దర్శకుడు బోయపాటికి తిరుగులేదు. ఆయనతో సినిమాలు చేసిన హీరోలందరికీ దాదాపు హిట్లనే ఇచ్చాడు బోయపాటి. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా బోయపాటి 'వినయ విధేయ రామ' సినిమాను రూపొందిస్తున్నాడు. 

జనవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత బోయపాటి.. బాలకృష్ణ హీరోగా సినిమా చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన 'ఎన్టీఆర్' బయోపిక్ ఆడియో లాంచ్ లో ప్రకటన చేశారు. ఈ సందర్భంగా బోయపాటి 'సింహా', 'లెజెండ్' లను మించి సినిమా ఉంటుందని అంచనాలను పెంచేశాడు.

ఈ సినిమా కథ బాలకృష్ణని ఎంతగా మెప్పించిందంటే.. రెమ్యునరేషన్ గా బోయపాటికి రూ.15 కోట్లు ఫిక్స్ చేశారట. ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకోవడం బోయపాటికి ఇదే తొలిసారి.

స్టార్ హీరోలకు ధీటుగా బోయపాటికి రెమ్యునరేషన్ ఇస్తున్నారంటే.. ప్రాజెక్ట్ పై ఎంత నమ్మకంగా ఉన్నారో చెప్పాల్సిన అవసరం లేదు. ఫిబ్రవరిలో ఈ సినిమా మొదలుకానుంది. మరి ఈ సినిమాతో బోయపాటి.. బాలయ్యకి ఎలాంటి సక్సెస్ ఇస్తాడో చూడాలి!