సినిమా ఇండస్ట్రీలో హిట్టు వస్తే ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది.. ఫ్లాప్ వస్తే మరో విధంగా ఉంటుంది. ఎంతటి పెద్ద స్టార్ అయినా.. డిజాస్టర్ సినిమా తీస్తే గనుక ఇక అతడి స్టార్ డం అమాంతం పడిపోతుంటుంది. ఇప్పుడు దర్శకుడు బోయపాటిది కూడా అదే పరిస్థితి.

ఇటీవల రామ్ చరణ్ తో ఆయన తెరకెక్కించిన 'వినయ విధేయ రామ' ఘోర పరాజయం పొందింది. అప్పటివరకు బోయపాటి సినిమాలకు తిరుగుండదని భావించే వారందరికీ ఈ సినిమా పెద్ద షాక్ ఇచ్చింది. ఈ సినిమాకి బోయపాటి రూ.15 కోట్ల రెమ్యునరేషన్ ని తీసుకున్నారు. దానికి టాక్స్ లు మళ్లీ నిర్మాత కట్టుకోవాల్సిందే.

ఇంతటి రెమ్యునరేషన్ తీసుకున్న అతడి రేంజ్ సగానికి సగం పడిపోయింది. బాలయ్యతో బోయపాటి చేయబోతున్న సినిమాకు ఆరు కోట్ల రెమ్యునరేషనే ఇవ్వాలని బాలయ్య ఫిక్స్ అయ్యాడట. బాలయ్యతో 'సింహా' సినిమా తీసే సమయంలో బోయపాటి రెమ్యునరేషన్ రూ.3 కోట్లు. ఆ తరువాత చేసిన 'లెజెండ్'కి రూ.6 కోట్లు ఇచ్చారు.

ఇప్పుడు అదే రెమ్యునరేషన్ బోయపాటికి ఇవ్వాలని బాలయ్య నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తన సొంత బ్యానర్ పై బాలయ్య ఈ సినిమా  తీయబోతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బోయపాటి రెమ్యునరేషన్ డిమాండ్ చేసే ఛాన్స్ కూడా లేకుండా పోయింది. దీంతో బాలయ్య ఎంత ఇస్తే అంత తీసుకోవాలని డిసైడ్ అయినట్లు సమాచారం.