Asianet News TeluguAsianet News Telugu

BoyapatiRapo : బోయపాటి - రామ్ పోతినేని మూవీ షూటింగ్ ప్రారంభం.. ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్.!

ఉస్తాద్ రామ్ పోతినేని - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ క్రేజీ  ప్రాజెక్ట్ రూపుదిద్దుకోబోతున్న విషయం తెలిసిందే. ఈరోజు చిత్ర షూటింగ్ ను ప్రారంభించారు.  ఈ సందర్భంగా మేకర్స్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. 
 

Boyapati Ram Pothineni Movie Started, Interesting details!
Author
First Published Oct 6, 2022, 6:45 PM IST

బ్లాక్ బాస్టర్ సినిమాలకు, మాస్ యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu). ఆయన సినిమాల్లో భారీతనం ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే కథ, కథనాలు, సన్నివేశాలు, పాటలు ఉండేలా చూస్తుంటారు బోయపాటి. అంందుకే ఆయన సినిమాల కోసం ప్రేక్షకుల ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. గతేడాది నందమూరి బాలయ్యతో బోయపాటి చిత్రకీరించిన ‘అఖండ’ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ మూవీ తర్వాత వెంటనే ఎనర్జిటిక్ స్టార్ రామ్  పోతినేని (Ram Pothineni)తో సినిమాను అనౌన్స్ చేశారు. ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అవ్వడంతో అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

తాజాగా అదిరిపోయే న్యూస్ కూడా చెప్పారు. ‘బోయపాటి రాపో’ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ను ఈ రోజు ప్రారంభించినట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అప్పటికే  హీరోలను హై రేంజ్ లో చూపించే బోయపాటి దర్శకత్వంలో ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా నటిస్తుండటంతో సినిమాపై మరింత ఆసక్తి  క్రియేట్ అయ్యింది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 9గా ప్రతిష్టాత్మకంగా నిర్మాత శ్రీనివాసా చిట్టూరి సినిమాను నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా మూవీలో రామ్ సరసన కథానాయికగా శ్రీ లీలా (Sree Leela)ను ఎంపిక చేసినట్లు తెలిపారు. అలాగే, ఈ చిత్రానికి సంగీత సంచలనం ఎస్. థమన్ మ్యూజిక్ అందించనున్నట్లు కూడా వెల్లడించారు. 

ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ సినిమాపై ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. 'అఖండ' విజయం తర్వాత బోయపాటి చేస్తున్న తర్వాతి చిత్రమిది. బోయపాటి శ్రీను, రామ్ కాంబినేషన్‌లో సినిమా అనగానే ప్రేక్షకులలో అంచనాలు పెరిగాయి. వాటికి తగ్గట్టు సినిమా ఉంటుంది. రామ్ ఎనర్జీకి పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యే క్యారెక్టర్‌ను బోయపాటి డిజైన్ చేశారు. ఈ రోజు రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ యాక్షన్ ఎపిసోడ్‌తో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశాం. స్టంట్ శివ నేతృత్వంలో ఆ యాక్షన్ దృశ్యాలు తెరకెక్కిస్తున్నాం. సుమారు 30 రోజులు ఈ షెడ్యూల్ ఉంటుంది. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునే కథతో ఉన్నత సాంకేతిక విలువలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారీ చిత్రమిది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ - ఐదు భాషల్లో గ్రాండ్ రిలీజ్ చేస్తాం. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. చిత్రానికి ఎడిటింగ్ : తమ్మిరాజు, సినిమాటోగ్రఫీ గా సంతోష్ ఎంపికయ్యారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios