ఎలక్షన్స్ లో ఒక పార్టీ గెలుపుకోసం అధిష్టానం ఏదైనా బాధ్యతను అప్పగిస్తే గెలుపుకోసం నాయకులూ పడే కష్టం అంతా ఇంతా కాదు. కానీ కొంచెం తొందరపడిన ఆది మైనెస్ అయ్యే అవకాశం ఉంటుంది. తెలిసి చేసిన పనులు రాజకీయాల్లో కొన్ని సార్లు చివరలో తెలియకుండా వెన్నుపోటులా మారే అవకాశం ఉంటుంది. 

బోయపాటికి అదే చేదు అనుభవం ఇటీవల ఎలక్షన్స్ వల్ల ఎదురైంది. ఈ మాస్ దర్శకుడు స్క్రీన్ పై తన డైరెక్షన్ కసిని ఏ రేంజ్ లో ప్రజెంట్ చేస్తాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రోమాలు నిక్కబొడిచేలా ఎమోషన్ సీన్ ని చూపించడంలో దర్శకుడి స్టయిలే వేరు. 

తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ లో గెలవాలని యాడ్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న చంద్రబాబు ఆ బాధ్యతలను బోయపాటి శ్రీనివాస్ కి అప్పగించాడు. బాలకృష్ణ రికమండేషన్ కూడా బోయపాటికి కలిసి రావడంతో 4 నుంచి 5 కోట్ల వరకు బేరం కుదుర్చుకొని దర్శకుడు యాడ్స్ చేసినట్లు టాక్.

అయితే బోయపాటి తన అనుభవంతో మంచి యాడ్సే చేసినప్పటికీ అవి బెడిసికొట్టాయి. ఏ మాత్రం ఉపయోగపడలేదని అర్థమైపోయింది. యాడ్స్ లో కసి ఎమోషన్ అలాగే ప్రత్యర్థి పార్టీలకు కౌంటర్లు, వార్నింగ్ లు.. ఇలా అన్ని తరహాలో కలగలిపి యాడ్స్ ని బాగానే డిజైన్ చేశారు. 

కానీ ఏవి కూడా రిజల్ట్ పై ప్రభావం చూపలేకపోయాయని అర్ధమవుతోంది. పైగా టీడీపీని అతిగా పొగిడేస్తున్నట్లుగా ఉన్న ఆ యాడ్స్ ఏ మాత్రం బాగాలేవని కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. వినయ విధేయ రామ సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్న బోయపాటి కష్టపడి చేసిన యాడ్స్ కూడా టీడీపీకి ఎలాంటి లాభాన్ని ఇవ్వకపోవడం బ్యాడ్ లక్ అని చెప్పాలి.