Asianet News TeluguAsianet News Telugu

సోమవారం..రంగస్థలం బాక్స్ ఆఫీస్ రిపోర్ట్

సోమవారం..రంగస్థలం బాక్స్ ఆఫీస్ రిపోర్ట్
box office  rangasthalam collections even monday also super strong

రాంచరణ్ బాక్స్ ఆఫీస్ పై పంజా విసిరితే ఎలా ఉంటుందో మరో మారు రుజువైంది. బాక్స్ ఆఫీస్ పై యుద్ధంలో సోమవారం కూడా రంగస్థలం చిత్రం ఏకపక్ష పోరే సాగిస్తోంది. వీకెండ్ లో ఏ చిత్రనికైనా వసూళ్లు అదిరిపోతాయి. కానీ సోమవారం నుంచే అసలు పరీక్ష మొదలవుతుంది. దిగ్విజయంగా తొలి వీకెండ్ ముగించుకున్నా రంగస్థలం చిత్రం సోమవారంలోకి అడుగుపెట్టింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం రంగస్థలం చిత్రం ఆధిపత్యం సోమవారం కూడా కొనసాగింది. దీనితో రీనల్ వసూళ్లు కళ్ళు చెదిరే విధంగా ఉండబోతున్నాయని అంచనా వేస్తున్నారు. నాలుగురోజుల్లో రంగస్థలం చిత్రం ఏమేరకు కలెక్షన్లు సాధించిందో ఇప్పుడు చూద్దాం! 

రంగస్థలం చిత్ర కలెక్షన్ల తుఫాన్ ఆగడం లేదు. తొలి వీక్ ఎండ్ లోనే 50 కోట్లకు పైగా రంగస్థలం చిత్రం షేర్ ని ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే తొలి వీకెండ్ లో 38 కోట్ల వరకు వసూలు చేయడం విశేషం

ఏ చిత్రానికైనా సోమవారం పెద్ద పరీక్ష ఎదురవుతుంది. సినిమాలో దమ్ము లేకుంటే అప్పటి వరకు వచ్చిన కలెక్షన్లు కాస్త సోమవారం పూర్తిగా తగ్గిపోతాయి. రంగస్థలం చిత్రం తొలి రోజు నుంచే యునానిమస్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీనితో సోమవారం కూడా రంగస్థలం బాక్స్ ఆఫీస్ రన్ సూపర్ స్ట్రాంగ్ గా కొనసాగుతోంది.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం రంగస్థలం చిత్రం సోమవారం రోజు రెండు తెలుగు రాష్ట్రలో రూ 6.30 కోట్ల వసూలు చేసింది. సోమవారం రోజు ఈ గణాంకాలు అద్భుతమైనవిగా చెప్పొచ్చు. 

రెండు తెలుగు రాష్ట్రాల్లో రంగస్థలం చిత్రం సోమవారానికి 45 కోట్ల షేర్ వసూలు చేయడం విశేషం. ఉత్తరాంధ్రలో నాలుగురోజుల్లో రంగస్థలం చిత్రం రూ 6 కోట్ల షేర్ సాధించింది. 

ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రంగస్థలం చిత్రం 50 కోట్లకు పైగా షేర్ తో దూసుకుపోతోంది. మంగళవారం ఈ సంఖ్య 60 దాటడం ఖాయం అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios