సూపర్ డూపర్ హిట్టయిన మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150చిత్రం ఖైదీ సక్సెస్ లో అభిమానుల ప్రధాన పాత్ర మెగా అభిమానుల కోసం థాంక్స్ గివింగ్ ఈవెంట్
అభిమానుల పట్ల మెగాస్టార్ చిరంజీవిది ప్రత్యేకమైన అనుబంధం. చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150సూపర్ డూపర్ సక్సెస్ కావడంతో...మెగా స్టార్ చిరంజీవి చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ విజయంలో తన ఫ్యాన్స్ పాత్ర ఎంతో ఉందని ఆయన బలంగా నమ్ముతున్నారు. అందుకే ఫ్యాన్స్ కోసం ఓ మెగా సక్సెస్ మీట్ ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు.
విశాఖ లో చేయాలని మొదట అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల హైదరాబాద్ లోనే బెటర్ అని డిసైడ్ అయ్యారు. అసలు జనవరి 28నే చేద్దామనుకున్నారు. కానీ వాయిదా వేసారు. ఇప్పుడు ఇక ఆలస్యం చేయకుండా ఫ్యాన్స్ కు థ్యాంక్స్ గివింగ్ మీట్ జరపాలని మెగాస్టార్ అండ్ టీమ్ డిసైడ్ అయ్యారు.
మెగా ఈవెంట్ ను అభిమానుల కోసం గ్రాండ్ గా నిర్వహించేందుకు హైదరాబాద్ లోని కోట్ల విజయభాస్కర రెడ్డి స్టేడియం ను వేదికగా నిర్ణయించారు. అతి త్వరలో జరిగే ఈ థాంక్స్ గివెన్ మీట్ ను అభిమానులు కలకాలం గుర్తుంచుకునేలా నిర్వహించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ధృవ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇదే స్టేడియంలో గ్రాండ్ సక్సెస్ అయ్యింది.
