Asianet News TeluguAsianet News Telugu

సూపర్‌ స్టార్‌ ఇంటికి బాంబు బెదిరింపు

రజనీకాంత్ ఇంటికి బాంబు బెదిరింపు రావటంతో చెన్నై పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు అణువనువూ గాలించారు. అయితే ఎలాంటి బాంబు దొరక్కపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు.

Bomb hoax at Tamil superstar Rajinikanths Chennai residence
Author
Hyderabad, First Published Jun 18, 2020, 5:42 PM IST

సౌత్‌ సూపర్‌ స్టార్ రజనీకాంత్ ఇంట్లో బాంబు ఉందంటూ వచ్చిన ఫోన్‌ కాల్‌ కలకలం సృష్టించింది. పోయెస్‌ గార్డెన్స్‌లోని రజనీ ఇంట్లో బాంబు పెట్టామని, అది ఏ క్షణమైనా పేలొచ్చని ఓ ఆకతాయి ఫోన్ చేయటంతో ఇండస్ట్రీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. వెంటనే స్పందించిన పోలీసులు యంత్రాంగం రజనీ ఇంటికి చేరుకొని అణువణువూ గాలించారు. బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్వ్కాడ్‌ తనీఖీలు నిర్వహించారు. రజనీ ఇంటితో పాటు చుట్టు పక్కల ఇళ్లలో కూడా తనిఖీలు నిర్వహించారు.

అయితే బాంబ్‌ దొరక్కపోవటంతో అది ఫేక్‌ కాల్ అని కన్ఫర్మ్‌ చేశారు. ఎవరో అలజడి సృష్టించాలనే ఇలాంటి ఆకతాయి పని చేసిన పని అని, రజనీ ఇంట్లో గాని పరిసర ప్రాంతాల్లోగాని ఎలాంటి బాంబు లేదని చెన్నైపోలీసులు వెల్లడించారు. అంతేకాదు ఫేక్ కాల్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని పట్టుకున్నారు. అతడి మానసిక పరిస్థితి సరిగా లేదని అందుకే అలా చేశాడని నిర్ధారించారు పోలీసులు.

అయితే ఇటీవల తమిళనాట ఇలాంటి ఫేక్‌ కాల్స్‌ ఉదంతాలు తరుచూ వినిపిస్తున్నాయి. గతంలో పలుమార్లు ఇలాగే రజనీకాంత్‌ ఇంట్లో బాంబు ఉందంటూ ఫోన్లు రాగా, ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ఇంట్లో కూడా బాంబు ఉందన్న బెందిరింపు కాల్ వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఫేక్‌ కాల్స్‌ చేసే ఆకతాయిల మీద కఠినచర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios