దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. వేలమంది ప్రజలు కరోనా కారణంగా మరణించడం జరిగింది. ఇక దేశంలో కరోనా రోగుల సంఖ్య 70లక్షలకు దాటిపోయింది. కరోనా ప్రభావిత రాష్ట్రాలలో ముంబై మొదటిస్థానంలో ఉంది. అలాగే ముంబై నగరంలో కరోనా వ్యాప్తి అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉంది. అమితాబ్ కుటుంబంతో పాటు అనేక మంది ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. కొందరు ప్రాణాలు సైతం కోల్పోయారు. 

తాజాగా బాలీవుడ్ సీనియర్ సింగర్ కుమారు సాను కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా లక్షణాలు కన్పిస్తున్న నేపథ్యంలో కోవిడ్ టెస్టులు నిర్వహించగా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులు తెలియజేశారు. దురదృష్టవశాత్తు షానుదా కరోనా బారిన పడ్డారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్ధించాలని సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేయడం జరిగింది. 

కలకత్తాకు చెందిన కుమార్ సాను అసలు పేరు కేదార్ నాధ్ భట్టాచార్య. మెలోడీ కింగ్ గా పేరున్న కుమార్ సాను 90లలో టాప్ సింగర్స్ లో ఒకరిగా ఉన్నారు. ఇక కుమార్ సాను కొడుకు జాను కుమార్ సాను ప్రస్తుత హిందీ బిగ్ బాస్ షోలో పాల్గొనడం విశేషం. తన కొడుకు బిగ్ బాస్ షోలో పాల్గొనడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్న కుమార్ సాను...తన కుమారుడిని సపోర్ట్ చేయాల్సిందిగా ఫ్యాన్స్ ని కోరుకున్నారు. కుమార్ సాను అమెరికాలో ఉన్న కుటుంబాన్ని కలిసే ఆలోచనలో ఉండగా ఇలా జరిగింది.