Asianet News TeluguAsianet News Telugu

నా ఫ్యామిలీపై ట్రోల్స్ బాధించాయి. బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి భావోద్వేగం

బాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో సునిల్ శెట్టి భాగోద్వేగానికి గురయ్యారు. తనకుటుంబం సొషల్ మీడియాలో ఫేస్ చేసిన ట్రోలింగ్ గురించి.. గుర్తు చేసుకుంటూ.. ఎమోషనల్ అయ్యారు. 

Bollywood Star Senior Hero Sunil Shetty Comments On Trolls JMS
Author
First Published Apr 25, 2023, 8:59 AM IST

ఈ మధ్య సోషల్ మీడియా బాగా రెచ్చిపోతోంది. సెబ్రిటీస్ టార్గెట్ గా రకరకాలుగా ట్రోల్ చేస్తూ.. వారి పర్సనల్ లైఫ్ ను కూడా బజార్లో పెడుతుంటారు. ఇక ఫిల్మ్ స్టార్స్ గురించి ఏదైనా వైరల్ న్యూస్ వస్తే.. తెగ ఎంజాయ్ చేస్తారు నెటిజన్లు. కాని వారి గురించి అసభ్యంగా పోస్ట్ చేసినా కూడా అంతే ఎంజాయ్ చేస్తూ..కామెంట్లు పెడుతంటారు. అవి వారి మనసుని ఎంత బాధిస్తాయి.. అందులో నిజం ఎంతా..? ఇలాంటివి  చాలా మంది ఆలోచించరు.సెలబ్రిటీస్ టార్గెట్ గా చేసే ట్రోలింగ్ చూసేవారికి.. వినేవారికి ఎంతో హ్యాపీగా ఉంటుంది. కాని ట్రోల్స్ ఫేస్ చేసేవారికి ఎంత మానసిక వేదన ఉంటుంది అనేది మాత్రం ఎవరూ ఆలోచించరు.

ట్రోల్స్ విషయంలో సెలబ్రిటీస్  కొంత మంది పట్టించుకోకుండా వదిలేస్తుంటారు. మరికొంత మంది మాత్రం పర్సనల్ గా  తీసుకుంటారు. బాధపడుతుంటారు. మరికొంత మంది మాత్ర రివర్స్ కౌంటర్లతో అటాక్ ఇస్తుంటారు. ఈక్రమంలో తమపై వచ్చిన ట్రోల్స్  గురించి వెల్లడిస్తూ.. ఎమోషనల్ అయ్యారు బాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో   సునీల్ శెట్టి ఈ విషయంలో తన బాధను వ్యక్త పరిచారు. 

తనపై.. తన ఫ్యామిలీపై వస్తున్న ట్రోలింగ్.. పైన బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా కారణంగా సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ బాగా డిస్ట్రబ్ అవుతుందని..  వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుతోందన్నారు. తాను కూడా వివిధ సందర్భాల్లో ట్రోల్స్ ను ఎదుర్కొన్నానని చెప్పారు. తన తల్లి, కూతురు పైన ఓ వ్యక్తి అసభ్యకరంగా చేసిన వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయన్నారు. ది రణవీర్ షోకు ఆయన అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఇలా వాఖ్యానించారు. సోషల్ మీడియా వల్ల ప్రైవసీ లేకుండా పోతోందన్నారు. 

ఏదైనా మాట్లాడితే దానిని మరో రకంగా ఎడిట్ చేసి, తమకు ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఏం మాట్లాడాలన్నా తనకు భయం వేస్తోందన్నారు. ఒక మాట మాట్లాడితే పదిహేను రకాలుగా దానిని ప్రచారం చేస్తున్నారన్నారు. తనది పాత తరమని, అందుకే సోషల్ మీడియా ట్రోల్స్ తనను బాధిస్తుంటాయన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios