Asianet News TeluguAsianet News Telugu

హీరోయిన్ పై ముద్దులు కురిపించిన సల్మాన్ ఖాన్, పక్కకు వెళ్ళి.. మూతి తుడుచుకున్న బాలీవుడ్ హీరో.. ఎందుకంటే..?

బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కు వరుసగా ముద్దులుకురిపించాడు స్టార్ సీనియర్ హీరో సల్మాన్ ఖాన్. ముద్దులు పెట్టిన తరువాత ఆయన పక్కకు వెళ్లి మూతి తుడుచుకున్నారు. ఈ  సీన్ చూసినవాళ్ళు ఆశ్చర్యంతో షాక్ అయ్యారు. ఇంతకీ సల్మాన్ అలా ఎందుకు చేశాడో తెలుసా..? 
 

Bollywood Star Hero Salman Khan Kissed Heroine Jacqueline Fernandez JMS
Author
First Published Apr 2, 2023, 1:44 PM IST

బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో అంటే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు సల్మాన్ ఖాన్. చాలా మంది హీరోయిన్స్ కు ఆయనంటే పిచ్చి. కాని ఆయన మాత్రం ఎవరిని పెళ్లి చేసుకోలేదు. బ్యాచిలర్ గానే ఉండిపోయాడు. కాకపోతే బాలీవుడ్ లో ఆయన చాలా మంది హీరోయిన్స్ తో ప్రేమాయనం నడిపించారు అన్నది మాతరం అదరు ఎరిగిన సత్యమే. అంతే కాదు చాలా మంది హీరోయిన్స్ ని ఆయన ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆ లిస్టులో శ్రీలంకకు చెందిన బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఉంది. 

ఇక ఇఫ్పుడు జాక్వెలిన్ బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అంతే కాదు  సల్మాన్ ఖాన్  తో  కలిసి చాలా సినిమాల్లో నటించింది జాక్వెలిన్.  కిక్ సినిమాతో మొదలెట్టి.. ఎన్నో సినిమాల్లో వీరిద్దరు కలసి నటించి మెప్పించారు. ఇక కిక్ తరువాత జాక్వలిన్ కు వరుస ఆఫర్లు రావడంతో బాలీవుడ్ లో బిజీగా మారిపోయింది. అప్పటి నుంచే జాక్వెలిన్ బాలీవుడ్ లో తిరుగులేని హీరోయిన్ గా మారిపోయింది. ఈక్రమంలోనే సల్మాన్ ఖాన్, జాక్వెలిన్ కు సబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఆ వీడియోలో సల్మాన్ ఖాన్ జాక్వెలిన్ కి వరుసగా రెండు సార్లు ముద్దు పెట్టారు. ఆ తర్వాత పక్కకు వెళ్ళి.. తన  పెదాలను టీ షర్ట్ కి తుడుచుకున్నారు. ఇది చూసిన వారు షా్్ అవుతున్నారు.. అసలు సల్మాన్ ఎందుకు ఇలా చేసి ఉంటాడు అని అంతా చర్చించుకుంటున్నారు. ఒక  షూటింగ్ సెట్స్ లో ఇది జరగ్గా.. వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.  జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఒక పక్కన నిలుచుని ఉండగా.. సల్మాన్ ఖాన్ ఆమె బుగ్గపై ముద్దు పెట్టారు. జాక్వెలిన్ నవ్వుకుంటుంటే.. సల్మాన్ ఖాన్ పక్కకు వెళ్ళిపోయి తన మూతిని టీ షర్ట్ తో తుడుచుకున్నారు. 

 

అయితే సల్మాన్ చేసిన ఈ చర్యకు అసలు కారణం ఆమె బుగ్గ మీద ఉన్న మేకప్ తన పేదలకు అంటుకోవడం.దాని వల్లే  సల్మాన్ ఖాన్  ఇలా పెదాలను తుడుచుకున్నారు కాని.. వేరే కారణాలేమి లేవని సమాచారం. వీరిద్దరికి సబంధించి ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సల్మాన్, జాక్వెలిన్ ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారని.. కరోనా లాక్ డౌన్ సమయంలో ఫార్మ్ హౌజ్ లో ఇద్దరూ కలిసే ఉన్నారని రూమర్లు వచ్చాయి. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios