బాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో.. సల్మాన్ ఖాన్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సల్మాన్ కు చాలా ఇష్టమైన వ్యాక్తి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. వారిని తలుచుకుంటూ.. ఎమోషనల్ అయ్యారు సల్మాన్.
స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంట్లో తీవ్ర విషాదం జరిగిది. బాలీవుడ్ స్టార్ తీవ్ర భావోద్వేగం చెందుతూ వెల్లడించిన వివరాలు ప్రకారం.. ఆయన్ను పెంచి పోషించిన పెద్దావిడి అకాల మరణం చెందినట్టు తెలుస్తోంది. ఆమె చనిపోయిందని సల్మాన్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకీ ఎవరామె.. సల్మాన్ ఎందుకు ఇంత ఎమోషనల్ అయ్యారు.
తాజాగా సల్మాన్ ఖాన్ అద్దు అని పిలిచే పద్దావిడ చనిపోయినట్టు తెలుస్తోంది. అద్దు అని సంభోదిస్తూ... ఆమె చనిపోయిందని, రెస్ట్ ఇన్ పీస్ అంటూ.. ఇన్ స్టాలో పోస్ట్ శేర్ చేశారు సల్మాన్ ఖాన్. ఆమె ఫొటోని పోస్ట్ చేసిన ఆయన చాలా ఎమోషనల్ అయినట్టు తెలుస్తోంది. దీంతో అసలు ఈమె ఎవరా అని ఫ్యాన్స్ ఆరాలు తీయ్యడం స్టార్ట్ చేశారు. కొందరేమో సల్మాన్ చిన్నతనంలోని కేర్ టేకర్ ఈమె అని అంటున్నారు. కాదు సల్మాన్ ఖాన్ ఆంటీ ఈవిడ అని మరికొంత మంది అంటున్నారు.
ఇక కోట్లాది అభిమానులను సంపాదించుకున్న సల్మాన్ ఖన్.. తాజాగా కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించాడు. కాని ఈసినిమా తీవ్రంగా నిరాశపరిచింది. హిందీలో కాస్త పర్వాలేదు అనిపించినా..? మిగతా భాషల్లో దారుణ పరాజయం చూసింది. మల్టీ లాంగ్వేజ్ లో ఈసినిమా రిలీజ్ చేసినా..మల్టీ స్టార్స్ తో సందడి చేసినా.. ఈ ఫార్ములు ఏమాత్రం వర్కౌట్ అవ్వలేదు. దాంతో సల్మాన్ టీమ్ తీవ్ర నిరాశలో మునిగిపోయింది.
పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈమూవీలో సౌత్ స్టార్ హీరో వెంకటేష్ ప్రత్యేక పాత్ర చేశారు. జగపతి బాబు స్పెషల్ క్యారెక్టర్ లోకనిపించగా.. టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ సాంగ్ లో మెరిసారు. సల్మాన్ ఖాన్ ప్రాణ స్నేహితుడు ..బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కూడా గెస్ట్ రోల్ లో అలరించారు. ఈమూవీ రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే.. నెగెటీవ్ టాక్ తెచ్చుకుంది.
