బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ (Akshay Kumar) తాజాగా నటించిన చిత్రం ‘పృథ్వీరాజ్’. ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామా జూన్3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పది రోజులూ ఆడకుండానే చిత్ర ప్రదర్శనను నిలిపివేయనున్నట్టు టాక్ వినిపిస్తోంది.
సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, 2017 మిస్ యూనివర్స్ మనూషి చిల్లర్ (Manushi Chhillar) జంటగా నటించిన హిస్టారికల్ ఫిల్మ్ ‘పృథ్వీరాజ్’ (Prithivi Raj). ఈ చారిత్రాత్మక చిత్రాన్ని యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించారు. చంద్రప్రకాష్ దర్శకత్వం వహించారు. అత్యంత పరాక్రమ ధైర్య సాహసాలు కలిగి ఢిల్లీని పరిపాలించిన పృథ్వీరాజ్ చౌహాన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కింది. ఢిల్లీ సామ్రాజ్యంపై అత్యంత క్రూరమైన దండయాత్ర చేసిన మహమ్మద్ ఘోరీ నుండి భారతదేశాన్ని రక్షించడానికి ధైర్యంగా పోరాడిన ఈ పురాణ యోధుని పాత్రలో అక్షయ్ నటించారు.
అయితే ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. దాదాపు రూ.300 కోట్లతో రూపొందిన ఈ మూవీ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరోవైపు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కూడా నటించడంతో భారీ హైప్ నెలకొంది. జూన్ 3న హిందీతో పాటు తెలుగులోనూ రిలీజ్ అయ్యింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత దర్శక నిర్మాతల అంచనాలను తారుమారు చేశాయి. రిలీజ్ అయ్యి పది రోజులు కూడా కాకుండా సినిమా పరిస్థితి ఘోరంగా ఉంది. ఇటు ప్రేక్షకులు, అటు బాక్సాఫీస్ కలెక్షన్స్ ఆందోళనకు గురిచేస్తున్నాయి.
తాజాగా, బీట్ టౌన్ లో ఈ చిత్రం గురించి ఓ టాక్ నడుస్తోంది. నార్త్ లోని ఓ థియేటర్ లో ప్రేక్షకులు లేక ఈ రోజు సినిమా ప్రదర్శనను నిలిపివేసినట్టు ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా సినిమాపై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో సినిమాను రద్దు చేశారనే రూమర్ కూడా క్రియేట్ అయ్యింది. మరోవైపు థియేటర్లలో నూ ఆక్యుపెన్సీ శాతం మరీ ఘోరంగా ఉండటం గమనార్హం. ఇప్పటి వరకు పృథ్వీరాజ్ సినిమా రూ. 55 కోట్ల మేరనే వసూళ్లు రాబట్టినట్టు తెలుస్తోంది. మిగితా బడ్జెట్ తిరిగిరావడం కష్టమేనని ప్రస్తుతం పరిస్థితులు తెలుపుతున్నాయి. ఏదేమైనా రిలీజ్ బాలీవుడ్ స్టార్ హీరో సినిమాకు ప్రేక్షకులు లేకపోవడం అవమానకరమేనంటూ పలువురు భావిస్తున్నారు.
