Pushpa The Rule : ‘పుష్ప 2’లో బాలీవుడ్ స్టార్.. కీలక పాత్ర కోసం ‘టైగర్ జిందా హై’ నటుడు.. లేటెస్ట్ అప్డేట్!
‘పుష్ప 2’పై ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందుతున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలోని నటీనటుల ఎంపిక ఆసక్తికరంగా మారుతోంది. తాజాగా ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ నటుడిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) మరియు రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప: ది రైజ్’ బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అభిమానులు దాని సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘పుష్ప: ది రైజ్’ రికార్డ్-బ్రేకింగ్ విజయం తర్వాత దానికి సీక్వెల్ గా ‘పుష్ప : ది రూల్’ తెరకెక్కుతోంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం సెట్స్ మీదకి వెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో చిత్రం నుంచి రోజుకో క్రేజీ అప్డేట్ నెట్టింట వైలర్ అవుతోంది. తాజాగా మరో న్యూస్ ఆసక్తికరంగా మారింది.
Pushpa the Ruleను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. రూ.350 కోట్ల బడ్జెట్ తో మరింత గ్రాండ్ గా రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో స్క్రిప్ట్ లోనూ కొన్ని మార్పులు చేశారంట క్రియేటివ్ దర్శకుడు సుకుమార్. మొదటి పార్ట్ తో పోల్చితే సీక్వెల్ లో కొత్త పాత్రలు యాడ్ అవుతాయని సమాచారం. ఇందుకోసం నటీనటుల ఎంపిక వేటలో ఉన్నారంట. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడి పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే బాలీవుడ్ స్టార్ అర్జున్ కపూర్ నటిస్తున్నారని ప్రచారం జరిగింది. కానీ వాటిని కొట్టిపారేశారు మేకర్స్. ప్రస్తుతం మళ్లీ అదే తరహా బజ్ వినిపిస్తోంది. ఈ సారి వచ్చిన అప్డేట్ ప్రకారం.. కీలక పాత్ర కోసం ‘టైగర్ జిందా హై’ చిత్రంలో నెగెటివ్ రోల్ నటించిన సజ్జాద్ డెలాఫ్రూజ్ (Sajjad Delafrooz) ‘పుష్ప2’లో అలరించబోతున్నారంట. గుడ్ ఫిజిక్, గుడ్ లుకింగ్ గా ఉండే సజ్జాద్ అల్లు అర్జున్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనిపై ఇంకా అఫిషియల్ అప్డేట్ అందాల్సి ఉంది.
ప్రస్తుతం ‘పుష్ప’ చిత్రాన్ని రష్యన్ లాంగ్వేజీలో డిసెంబర్ 8న ప్రదర్శించబోతున్నారు. ఇందు టీం రష్యాలో సందడి చేస్తోంది. డిసెంబర్ 1నే రష్యాలో ల్యాండ్ అయిన అల్లు అర్జున్, సుకుమార్, రష్మిక మందన్న సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే రష్యన్ లాంగ్వేజీలో వచ్చిన ట్రైలర్ దుమ్ములేపేతోంది. సైమా, ఐఫా అవార్డులను కొల్లగొట్టిన పుష్పరాజ్ ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ దక్కించుకుంటున్నారు.