నార్త్ లో సౌత్ సినిమాల హవాపై బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) స్పందించారు.  నార్త్ లో వాళ్ల సినిమాలు ఆడుతున్నా.. బాలీవుడ్ సినిమాలు సౌత్ లో ఆడకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 

తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీల నుంచి ప్రస్తుతం అన్నీ పాన్ ఇండియన్ సినిమాలు వస్తున్నాయి. ఆయా ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అన్ని భాషల్లో తమ సినిమాను రిలీజ్ చేస్తూ మార్క్ క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా నార్త్ లో తమ సినిమాను ఆడించేందుక పక్కా ప్లాన్ వేస్తూ.. సత్తా చాటుతున్నారు. నార్త్ ఆడియెన్స్ కు అసలైన సినిమా చూపిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి రెబల్ స్టార్ ప్రభాస్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ప్రధానంగా నార్త్ ఆడియెన్స్ కు దగ్గరయ్యేందుకు విశ్వప్రయత్నాలు చేస్తూ సఫలమవుతున్నారు. ఇక కన్నడ నుంచి ‘కేజీఎఫ్’ KGF 1తో స్టార్ హీరో యష్ (Yash) ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో తెలిసిందే. అలాగే తమిళం నుంచి అజిత్ (Ajith), సూర్య (Surya) కూడా యూనివర్సల్ కాన్సెప్ట్ తో సినిమాలు తీస్తూ.. సౌత్ తోపాటు నార్త్ లోనూ హవా చూపిస్తున్నారు. 

అయితే, ఒకరకంగా చెప్పాలంటే సౌత్ సినిమాల ప్రభావం నార్త్ పై ఎక్కవే ఉందని చెప్పాలి. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ కొనసాగుతుండటంతో.. సౌత్ తోపాటు.. నార్త్ వైపు స్టార్ హీరోలు, దర్శక నిర్మాతలు ఫోకస్ పెడుతున్నారు. తెలుగు నుంచి ఇప్పటికే బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాలు నార్త్ ఆడియెన్స్ ను అలరించాయి. 
అయితే ఈ పరిమాణంపై తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ స్పందించారు. ముంబయిలోని IIFA అవార్డ్స్ 2022 సందర్భంగా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో సల్మాన్ ఖాన్ మాట్లాడారు. ‘సౌత్ సినిమాలు నార్త్ లో ఆడుతుండటం సంతోషంగా ఉంది. కానీ బాలీవుడ్ ఫిల్మ్స్ ఎందుకని సౌత్ లో ఆడటం లేదనేది అంతుపట్టట్లేదు. అయితే సౌత్ ఫిల్మ్స్ లో ఎక్కువగా హీరోయిజం చూపించడం జరుగుతుంది. థియేటర్ నుంచి ప్రేక్షకుడు బయటికి వస్తూ హీరోలా ఫీలవడం అనేది అద్భుతమైన ఫీలింగ్. ఇక్కడ కూడా అలాంటి సినిమాలు చేసుకుందుకు ప్రయత్నిస్తాం.’ అంటూ చెప్పుకొచ్చాడు. 

ఇటీవల ఆర్ఆర్ఆర్ RRR లో రామ్ చరణ్ (Ram Charan) యాక్టింగ్ కు సల్లూ భాయ్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ సినిమాలో నటిస్తున్నాడు. హిందీలో ‘టైగర్ 3’చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. టైగర్ 3 నుంచి రిలీజ్ అయిన టీజర్ యూట్యూబ్ లో రికార్డు క్రియేట్ చేస్తోంది. సల్మాన్ ఖాన్ కు జోడీగా హీరోయిన్ కత్రినా కైఫ్ (Katrina kaif) నటిస్తోంది.