Asianet News TeluguAsianet News Telugu

అమలాపురంలో అమీర్ ఖాన్.. పటిష్ట భద్రత నడుమ..

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్.. ఆంధ్రప్రదేశ్ కాకినాడలో ల్యాండ్ అయ్యారు. ప్రస్తుతం అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అక్కినేని నాగ చైతన్య కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Bollywood star Aamir Khan lands in Kakinada for lal sing chadda shoot
Author
Hyderabad, First Published Aug 13, 2021, 1:45 PM IST

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్.. ఆంధ్రప్రదేశ్ కాకినాడలో ల్యాండ్ అయ్యారు. ప్రస్తుతం అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అక్కినేని నాగ చైతన్య కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అమీర్, చైతు ఇద్దరూ ఆర్మీ అధికారులుగా, స్నేహితులుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. 

అద్వైత్ చందన్ దర్శకత్వంలో ఈ చిత్రంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అమలాపురం సముద్ర తీరంలో రెండు రోజుల పాటు లాల్ సింగ్ చద్దా షూటింగ్ జరగనుంది. చిత్ర యూనిట్ అమీర్ ఖాన్ కోసం కాకినాడలోని ఓ హోటల్ లో వసతి ఏర్పాట్లు చేశారు. 

హోటల్ వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఇతరులని ఎవ్వరినీ అమీర్ ఖాన్ వద్దకు అనుమతించడం లేదట. షూటింగ్ కోసం అమీర్ ఖాన్, లాల్ సింగ్ చద్దా చిత్ర యూనిట్ పలు ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. 

ఆర్మీ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. బలమైన కథ, కథనాలతో దర్శకుడు అద్వైత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ స్టార్లు తమ చిత్రాల షూటింగ్స్ కోసం ఎక్కువగా నార్త్ లొకేషన్స్ ని ప్రిఫర్ చేస్తుంటారు. కానీ ఈ చిత్రాన్ని అమలాపురంలో కూడా తెరకెక్కిస్తుండడంతో కథ ఎంత బలమైనదో అని అర్థం అవుతోంది. 

ఇప్పటికే నాగచైతన్య పార్ట్ షూటింగ్ పూర్తయింది. అమిర్ ఖాన్ ఏపీలో పర్యటిస్తున్నాడు కాబట్టి చైతు కూడా షూటింగ్ లొకేషన్ కు వెళ్లే అవకాశాలు లేకపోలేదు. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. 

గత నెలలోనే చిత్ర యూనిట్ లడాఖ్ లో కీలక షెడ్యూల్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అమిర్ ఖాన్ ప్రొడక్షన్స్, వైకమ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.  

Follow Us:
Download App:
  • android
  • ios