వయస్సు 50 అయినా.. కుర్ర హృదయాలను కొల్లగొడుతూనే ఉంది.. బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా... భర్త నుంచి విడాకులు తీసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం యంగ్ హీరోతో రిలేషన్ షిప్ లో ఉంది. ఇక తాజాగా తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది సీనియర్ బ్యూటీ.
50 ఏళ్ళు వచ్చినా ఏమాత్రం చెక్కు చెదరని శిల్పంలా నాజూగ్గా మెయింటేన్ చేస్తోంది బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోర. సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బజ్ ఖాన్ ను పెళ్ళాడు.. 2017 లో విడాకులు తీసుకుంది బ్యూటీ. అప్పటి నుంచి బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ తో రిలేషన్ మెయింటేన్ చేస్తోంది. ఇది అందరికి తెలిసిన విషయమే. చాలా కాలంగా వీరు కలిసి తిరుగుతున్నా.. పెళ్ళి మాత్రం చేసుకోవడం లేదు. దాంతో మలైకా మరి పెళ్లెప్పుడూ అని ప్రతీ చోట ఆమెకు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అసలు తనకంటే 10 ఏళ్ళు చిన్నవాడైన అర్జున్ కపూర్ నుఆమె పెళ్ళాడుతుందా..? లేక ఉన్నంత కాలం ఇలా రిలేషన్ షిప్ కే పరిమితంఅవుతారా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఇక తాజాగా ఆహె తన పెళ్ళిపై క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
అర్బాజ్ ఖాన్ తో మలైకా విడిపోయి చాలా కాలం అవుతోంది. తాజాగా అర్బాజ్ ఖాన్ ముచ్చటగా మూడో పెళ్ళి కూడా చేసుకున్నాడు. తన మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్‌ను అర్బజ్ పెళ్ళి చేసుకున్నాడు. అతనికి ఇది మూడో పెళ్లి. అర్బాజ్ ఖాన్ కారణంగా ఇప్పుడు మలైకా కూడా హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మలైకా తన రెండో పెళ్లి గురించి పెద్ద ప్రకటన చేసింది. మలైకా అరౌర ప్రస్తుతం ఝలక్ దిఖ్లా జా సీజన్ 11 కి జడ్జ్ గా ఉన్నారు. ఈ ఈవెంట్లో ఓ సందర్భంలో మలైకా పెళ్ళి టాపిక్ వచ్చింది. ఫరా ఖాన్ ఈ విషయం గురించి మలైకాను అడిగింది. సింగిల్ పేరెంట్ నుంచి డబుల్ పేరెంట్ గా మారుతున్నారా? అని ప్రశ్నించింది.
అయితే ఈప్రశ్నకు డైరెక్ట్ గా సమాధానంచెప్పలేదు మలైకా.. దాంతో మళ్లీ పెళ్లి చేసుకుంటావా... అని ఫరఖాన్ తిరిగి ప్రశ్నించింది. దాంతో మలైకా సూటిగా సమాధానం చెప్పకతప్పలేదు. మలైకా మాట్లాడుతూ.. నన్ను ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైతే నేను సిద్ధమే. ఎవరైనా నా దగ్గరకు వచ్చి పెళ్లి ప్రపోజ్ చేయాలి అని.. బంపర్ ఆఫర్ ప్రకటించింది. బాలీవుడ్ లో ఆమె ప్రకటన పెద్ద చర్చకు దారితీసింది. కుర్రాళ్లంతా మేము సై అంటూ ముందుకు వస్తున్నారు. మలైకా ఫ్యాన్స్ అయితే ఎగిరి గంతేస్తున్నారు. ఇంతకీ మలైకా పెళ్ళి చేసుకుంటుందా లేదా..?
