Asianet News TeluguAsianet News Telugu

నా కూతురు అలా పుట్టడంతో.. ఒత్తిడి భరించలేకపోయా.. రాణీ ముఖర్జీ ఎమోషనల్ కామెంట్స్

తన జీవితంలో  ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకుంది రాణీ ముఖర్జీ. ముఖ్యంగా.. తాను తల్లిగా మారిన రోజుల్లో ఎంత నరకం అనుభవించిందో చెప్పుకొచ్చింది.  

Bollywood Senior Heroine Rani Mukharji Emotional Comments JMS
Author
First Published Apr 1, 2023, 10:49 AM IST

కలర్ ఫుల్ లైఫ్.. కోట్ల సంపాదన, స్టార్ ఇమేజ్, జనాల్లో క్రేజ్..ఫిల్మ్ సెలబ్రిటీల్లో కామన్ గా కనిపించే పాయింట్స్ ఇవి. కాని ఇవి పైపై జీవితమే.. కనించేదే జీవితం కాదు.. సెలబ్రిటీల జీవితాల లోపలన ఉండే కష్ట సుఖాల గురించి బయట ఫ్యాన్స్ కి.. ఆడియన్స్ కు తెలియదు. తెలిసే అవకాశమే లేదు .. ఎప్పుడైనా వారి జీవితం గురించి.. పడ్డ కష్టాల గురించి.. అనుభవించిన బాధల గురించి సెలబ్రిటీలు సోషల్ మీడియాలోనో.. ఇంటర్వ్యూలలోనో చెపితే తప్ప.. సాధారణ జనాలకు ఆ విషయాలు తెలిసే అవకాశమే లేదు. 

కొంత మంది సెలబ్రిటీల లైఫ్ లో ఎన్నో కఠినమైన రోజులు ఉంటాయి.. అలాంటి రోజులకు సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు సైతం విధికి తలొగ్గాల్సిందే. తాజాగా  బాలీవుడ్  స్టార్ సీనియర్  హీరోయిన్ తన జీవితంలో  ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకుంది. ముఖ్యంగా.. తాను తల్లిగా మారిన రోజుల్లో ఎంత నరకం అనుభవించిందో చెప్పుకొచ్చింది. తన కూతురు 7వ నెలలోనే పుట్టడంతో.. ఎందో కంగారు పడ్డాను అంటూ ఆ కఠిన పరిస్థితులను గుర్తుచేసుకుంది.

రాణీ ముఖర్జీ...  తన డెలివరీ టైమ్ లో ఎదుర్కొన్న కఠిన పరిస్థితుల గురించి తలుచుకుని బాధపడింది. తను పడ్డ ఇబ్బందులు  ఏ మహిళ కూడా పడకూడదంటూ కోరకుంది. రీసెంట్ గా ఓ మిడియా సంస్థకు ఇచ్చిన  ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది రాణీ ముఖర్జీ.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాకు ఒక కూతురు పుట్టింది. ఆమె  రెండు నెలలు ముందుగానే పుట్టింది. అంటే 9 నెలలు నిండిన తరువాత పుట్టాల్సిన పాప.. 7వ నెలలోనే పుట్టింది. అప్పుడు  బేబీ చాలా సన్నగా ఉండటంతో.. నేను తీవ్ర ఒత్తిడికి గురైయ్యాను.  బేబీని 7 రోజులు ఐసీయూలోనే ఉంచారు. 15 రోజులు నేను ఆస్పత్రిలోనే ఉండి వేదన అనుభవించాను.. ఒక తల్లిగా ఆ బాధ ఎవ్వరికీ రాకూడదు అని కోరకుంటున్నాను అన్నారు రాణీ. 

అదృష్టం కొద్ది నా బిడ్డ క్షేమంగా తిరిగొచ్చింది.. అప్పటి వరకూ నేను అనుభవించిన బాధ వర్ణణాతీతం  అంటూ అప్పటి కఠిన పరిస్థితులను గుర్తుకు చేసుకుని ఎమోషనల్ అయ్యింది రాణీ ముఖర్జీ.  ఇక తన గారాల పట్టికి ఆదిరా అని పేరు పెట్టిన రాణీ.. పాప పుట్టిన తరువాత సినిమాలకు కాస్త విరామం ఇచ్చింది.  2018లో మళ్లీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. మర్దానీ 2, బంటీ ఔర్ బబ్లీ 2, తాజాగా మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే  సినిమాల్లో నటించింది. 

తన అందంతో.. నటనతో బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది రాణీ ముఖర్జీ. బాలీవుడ్ ను ఒకప్పుడు ఒక ఊపు ఊపి.. రాణిలా ఏలిన హీరోయిన్ రాణీముఖర్జీ.  విమెన్ సెంట్రిక్ సినిమాలు అంటే రాణీనే గుర్తుకు వస్తుంది. నటనకు  ఆస్కారం ఉన్న.. డిఫరెంట్ పిక్చర్స్ కు  కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది రాణీ ముఖర్జీ. తన నటనతో ఏడు ఫిల్మ్ ఫేర్ అవార్డులను సొంతం చేసుకుంది.   ఇక కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే 2014లో స్టార్ ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రాను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఏడాదికి పాపను కన్నది రాణీ ముఖర్జీ. 

Follow Us:
Download App:
  • android
  • ios