దేశం మొత్తం ప్రభాస్ మేనియా నడుస్తుంది. వందల కోట్ల మార్కెట్ ఉన్న ప్రభాస్ పర్ఫెక్ట్ పాన్ ఇండియా స్టార్ అనిపిస్తున్నారు. ఆయన డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి ఆదిపురుష్ మూవీ ప్రకటనే నిదర్శనం. బాలీవుడ్ హీరోలను కాదని దర్శకుడు ఓం రౌత్ ప్రభాస్ ని ఎంచుకున్నాడు. భారీ బడ్జెట్ తో మూవీ చేస్తే ఆ మాత్రం వసూళ్లు ప్రభాస్ తోనే సాధ్యం అని వారు గట్టిగా నమ్ముతున్నారు. ఆదిపురుష్ మూవీలో రామునిగా నటించే అరుదైన అవకాశం ప్రభాస్ తన స్టార్ డమ్ తో దక్కించుకున్నారు. 

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ పౌరాణిక చిత్రంపై ఓ రేంజ్లో అంచనాలు ఉన్నాయి. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం తీవ్ర పోటీ నడుస్తుందని సమాచారం. ఆదిపురుష్ లో ప్రభాస్ రాముడుగా చేస్తున్న నేపథ్యంలో హీరోయిన్ ఎవరైనా సీతగా కనిపించాల్సివుంది. ఇలాంటి ఎపిక్ రోల్ లో నటించే అవకాశం దక్కడం అనేది అరుదైన విషయం. దానితో పాటు ప్రభాస్ పక్క నటించే అవకాశం రావడం కూడా కెరీర్ కి బూస్ట్ ఇచ్చే అంశంగా హీరోయిన్స్ భావిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో అవకాశం ఇస్తే రెమ్యూనరేషన్ అటూఇటూ అయినా సైన్ చేసేయడానికి సిద్ధంగా ఉన్నారట. బాలీవుడ్ నుండి యంగ్ అండ్ స్టార్ హీరోయిన్స్ ఈ ఆఫర్ వస్తే పట్టేయడానికి రెడీగా ఉన్నట్లు సమాచారం. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా చేస్తున్నారంటూ కియారా అద్వానీ, ఊర్వశి రతెలా, అనుష్క శర్మ వంటివారి పేర్లు వినిపిస్తున్నాయి. ఫైనల్ గా ఆ లక్కీ ఛాన్స్ ఎవరు దక్కించుకుంటారో చూడాలి. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.