Alia Bhatt: ఆలియా భట్ ను రణ్ బీర్ కపూర్ వేధిస్తున్నాడా...? క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ. ః
బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ను .. ఆమె భర్త.. బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ వేధిస్తున్నాడా..? సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన వార్తల్లో నిజం ఎంత..? ఈ విషయంలో ఆలియా భట్ ఇచ్చిన క్లారిటీ ఏంటి..?

చేతిలో ఫోన్ ఉన్న ప్రతీ వాడు జర్నలిస్ట్అయిపోయాడు అంటోంది బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్. రీసెంట్ గా ఆమె కరీనా కపూర్ తో కలిసి కాఫీ విత్ కరణ్ ప్రోగ్రామ్ కువచ్చింది. ఈ ఈవెంట్ లో కొన్నిప్రశ్నలు ఎదురవ్వగా.. వాటికి సూటిగా జవాబు ఇచ్చింది బ్యూటీ. గత కొద్ది కాలంగా తనకు రణ్ బీర్ కు మనస్పర్ధలు వచ్చినట్టు.. రణ్ బీర్ తనను వేధిస్తున్నట్టు వచ్చిన వార్తల గురించి క్లారిటీ ఇచ్చింది ఆలియా.. ఇవ్వడం కాదు.. గూబ గుయ్యి..మనేలా కౌంటర్ ఇచ్చింది చిన్నది. ఇంతకీ ఆమె ఏమంటుందంటే..?
యష్ పై మనసు పారేసుకున్న కరీనా కపూర్, కెజియఫ్ స్టార్ కు జతగా బాలీవుడ్ బ్యూటీ..?
రణబీర్‌కి లిప్‌స్టిక్ నచ్చదు. నేను వేసుకుంటే కూడా ఊరుకోడు. తీసేయ్‌మని గొడవ చేస్తాడు. ఆ విషయాన్నే ఓ ఇంటర్‌వ్యూలో చెప్పాను. దానికి పెడార్థాలు తీస్తూ రణబీర్ నన్ను వేధిస్తున్నాడని ఏవేవో రాసేశారు. రకరకాలుగా ప్రచారం చేశారు. నిజానికి రణబీర్ చాలామంచి మనిషి. నన్ను చాలా బాగా చూసుకుంటాడు. నాపై రాసినా నేను బాధపడను. అవి నన్ను బాధించలేవుకూడా. కానీ తనపై రాశారు. అప్పుడు మాత్రం బాధ అనిపించింది అని అలియాభట్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
చేతిలో ఫోను ఉంటే ఇలాంటి వార్తలు ఎన్నైనా పుట్టించ వచ్చు అనుకుంటారు.. ఈమధ్య నేను సన్నగా మారటానికి, నా చర్మాన్ని తెల్లగా మార్చుకోటానికి కొన్ని సర్జరీలు చేయించుకున్నాని కూడా రాశారు. ఆమధ్య ఈ వార్త సోషల్‌మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఇవి నేను పట్టించుకోను.. ఇలాంటివి చదువుతూ రణబీర్, నేనూ ఇంట్లో మంచి టైంపాస్ చేస్తుంటాం. నిజంగా వాళ్లకు థ్యాంక్స్ చెప్పాలి.. మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నందకు అన్నారు అలియాభట్.
సోషల్ మీడియా ట్రోల్స్ పై గతంలో కూడా స్పందించింది ఆలియా భట్.. తనపై వస్తున్న ట్రోల్స్ గురించి స్పందిస్తూ.. సెలబ్రిటీలపై ఇలాంటివి కామన్.. మనం ప్రశాంతంగా ఉండాలన్నా.. ఫ్యామిలీ కూడా ప్రశాంతంగా ఉండాలనుకుంటే ముఖ్యంగా మనం సోషల్‌మీడియాకు దూరంగా ఉండాలి. అక్కడి కామెంట్స్ చదివినా, చూసినా మనశ్శాంతి ఉండదు అన్నారు. ఒక వేళ చదివినా.. చూసినా.. లైట్ తీసుకోవాలి..లేదా వాటిని కూడా ఎంజాయ్ చేయాలి అన్నారు. చాలా మంది వాటిని చూసి కంగారు పడిపోతుంటారు. రకరకాల ఆలోచణలు, అపోహలు, అపార్థాలు ఇలా జీవితం నాశనం కావడానికి అవి కారణం అవుతాయి. అందుకే నేను వాటిని పట్టించుకోను అన్నారు.
అంతే కాదు అదృష్టం కొద్ది.. ఈ విషయంలో నన్ను అర్ధం చేసుకునే భర్త నాకులభించాడు. అని ఎంతో సంతోషంగా వెల్లడించింది ఆలియా భట్. పనిలో పనిగా రణ్ బీర్ కపూర్ కు కాంప్లిమెంట్ కూడా ఇచ్చింది బ్యూటీ. ఇక మొన్నటి వరకూ తన పాప ఆలనా పాలన దగ్గరుండి చూసిన ఆలియా భట్.. ఇప్పుడిప్పుడే సినిమాల్లో యాక్టీవ్ అవుతున్నారు.