చేసిన పాపలు అంత ఈజీగా పోవు.. నిజం నిప్పు లాంటిది అది ఎప్పటికైనా బయటపడక తప్పదు అనేది పెద్దలు చెప్పే మాటలు. మీటూ విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న నటీమణులు వారికి జరిగిన అన్యాయాన్ని బహిరంగంగా చెప్పేస్తున్నారు.
చేసిన పాపలు అంత ఈజీగా పోవు.. నిజం నిప్పు లాంటిది అది ఎప్పటికైనా బయటపడక తప్పదు అనేది పెద్దలు చెప్పే మాటలు. మీటూ విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న నటీమణులు వారికి జరిగిన అన్యాయాన్ని బహిరంగంగా చెప్పేస్తున్నారు. అది ఎంతవరకు నిజం అని కొన్ని ప్రశ్నలు వస్తున్నప్పటికీ స్టార్ హీరోలు మాత్రం అలాంటి వారితో వర్క్ చేయడానికి ఇష్టపడటం లేదు.
ప్రస్తుతం లైంగిక వేధింపుల విషయాల్లో ఎక్కువగా దర్శకుల పేర్లే వస్తున్నాయి. మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సుభాష్ కపూర్ పై ఇటీవల లైంగికపరమైన ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. గీతికా త్యాగి అతని చెంప చెళ్లుమనిపించిన వీడియో వైరల్ అవుతూనే ఉంది. అయితే త్వరలో అతను
అమీర్ ఖాన్ తో `మొఘల్` అనే సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు ఈ సంగతి తెలియడంతో అమిర్ ఖాన్ సినిమాను క్యాన్సిల్ చేసుకున్నాడు. అదే తరహాలో అక్షయ్ కుమార్ కూడా తాను చేయబోయే సినిమా క్యాన్సిల్ చేసుకున్నాడు. అక్షయ్ సాజిద్ ఖాన్ తో హౌస్ ఫుల్ 4 ప్రాజెక్ట్ కి ఒకే చేశాడు. అయితే ఇప్పుడు ఆ దర్శకుడిపై ఆరోపణలు రావడంతో నిర్మాతకు ఫోన్ చేసి చెప్పేశాడు. ఆరోపణలు నిర్ధారణ అయిన ఏ ఒక్కరితోను పనిచేయలేను అని అక్షయ్ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చాడు.
ఈ విధంగా అక్షయ్ కుమార్ - అమిర్ ఖాన్ తీసుకున్న నిర్ణయాలకు అభిమానులు మద్దతు పలుకుతున్నారు.
