సెలబ్రిటీలు బయటకు వస్తే చాలు.. ఫ్యాన్స్ తో పాటు ఫోటోగ్రఫర్లు కూడా రెడీగా ఉంటారు. ఒకటి రెండు అని కాదు.. ఎన్ని వీలైతే అన్ని ఫోటోలు తీసుకోవాలి అని టార్గెట్ తో.. వెంట పడుతుంటారు. ఈక్రమంలో స్టార్ల చేత తిట్లు కూడా తింటుంటారు. 

సెలబ్రెటీలు బయటకు వస్తే పాప.. అభిమానులతో పాటు ఫోటో, వీడియో గ్రాఫర్ల మధ్య నలిగిపోవాల్సిందే. వారు చేసే హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కోసారి విసింగించేస్తారు. ఒక్కఫోటో ఒక్క ఫోటో అంటూ.. వరుసగా ఫోటోలు తీస్తూ.. వారికివిసుకగు వచ్చేలా చేస్తుంటారు. చాలా వరకూ ఓపిగ్గా ఉండే సెలబ్రిటీలు.. సహనం నశిస్తే మాత్రం.. ఇక వారికి ఉన్నదే.. కోపం తట్టుకోలేక తిట్టేయడం.. ఒక్కోసారి ఇంకో అడుగు ముందుకు వేసి చెంప్ప చెళ్ళుమనిపించడం సహజంగా జరిగే విషయమే. 

 సెలబ్రెటీల బాధలు అన్నీ ఇన్నీ కావు. ఒక వైపు అభిమానులు తాకిడి.. మరోవైపు ఫోటో స్టిల్ ప్లీజ్ అంటూ గోల ఇవన్నీ కొంత మేరకు సెలబ్రిటీలకు హ్యాపీగా ఫీల్ అయినప్పటికీ... కొన్నిసార్లు సెలబ్రెటీలు సహనం కోల్పోయి చిరాకు పడటమే కాదు.. కెమెరాలు లాగి నెలకు కొట్టిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా అలాంటి పరిస్థితి బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కు వచ్చింది. చాలా వరకూ ఓపిగ్గా ఉన్న బాలీవుడ్ హీరో.. ఒక్క సారిగా ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే. 

ఇక అసలు విషయానికి వస్తే.. సైఫ్ అలీ ఖాన్ తన భార్య కరీనా కపూర్ తో ఓ ప్రైవేట్ పార్టీకి వెళ్లాడు. అది చూసుకుని తిరిగి తమ ఇంటికి వెళ్తున్న సమయంలో ఫోటో గ్రాఫర్లు వారిని చూసి ఫోటోల కోసం ఎగబడ్డారు. వారు ఎక్కడికి వెళ్తే.. అక్కడకు ఫాలో అయ్యారు. అప్పటి వరకు వారితో సహనంగా మాట్లాడిన సైఫ్... కొంత మంది విసిగించడంతో ఒక్కసారిగా సహనం కోల్పోయి ఫొటోగ్రాఫర్లపై అసహనం వ్యక్తం చేశాడు. ఫోటో గ్రాఫర్లు వారి వెంట పరిగెడుతూ.. గుమ్మం వరకూ వచ్చి ఫోటోలు తీస్తుండటంతో రండి మా బెడ్ రూమ్ లోకి కూడా వచ్చేయండీ అంటూ మండి పడ్డాడు సైఫ్ అలీ ఖాన్. 

View post on Instagram

మార్చి 2 గురువారం బాలీవుడ్ హీరోయని్ మలైకా అరోరా తల్లి పుట్టిన రోజు వేడుకలకు వెళ్ళారు ఈ ఇద్దరు జంట. వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే సమయంలో సైఫ్, కరీనా జంట కోసం ఫోటోగ్రాఫర్లు వెయిట్ చేస్తున్నారు. ఈ జంట రాగానే వరుసగా కెమెరా ఫ్లాష్ లు మెరవడం మొదలయ్యాయి.సార్.. మేడమ్ ఒక్క ఫోటో ప్లీజ్ అంటూ ఫోటో గ్రాఫర్లు వెంట పడి విసిగిచేశారు. దాంతో సైఫ్ చాలా సేపు ఓపిగ్గా ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. అయినా ఇంకా అంటూ వదలకపోవడంతో.. ఆయనకు కోపం వచ్చింది. వెంటనే సైఫ్, కరీనా ఇద్దరూ వేగంగా నడుచుకుంటూ తమ ఇంటివైపు వెళ్తున్న సమయంలో ఫోటో గ్రాఫర్లు ఫాలో కావడంతో సైఫ్ అలీ ఖాన్ కోపం ఆపుకోలేకపోయాడున నవ్వుకుంటేనే చురకలు అంటించాడు.విరల్ భయానీ ఇన్‌స్టాగ్రామ్ లో ఈ వీడియోను షేర్ చేయగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.