Asianet News TeluguAsianet News Telugu

సెల్ఫీ కోసం వస్తే.. అభిమాని ఫోన్ విసిరేసిన బాలీవుడ్ స్టార్.. ఇంతకీ ఏం జరిగింది?

బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ (Ranbir Kapoor)కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సెల్ఫీ కోసం తన దగ్గరకి వచ్చిన అభిమానిపై సహనం కోల్పోయాడు. ఫోన్ తీసుకొని దూరంగా విసిరేశాడు. 
 

Bollywood hero Ranbir Kapoor Throws his fan Phone
Author
First Published Jan 28, 2023, 12:13 PM IST

పాన్ ఇండియా సినిమా ‘బ్రహ్మస్త్రం’తో  దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నార్త్ తో పాటు ఇటు సౌత్ లోనూ ఈ మూవీతో రణబీర్ కపూర్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. దీంతో ఆయన తదుపరి చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో రన్బీర్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ అభిమాని సెల్ఫీ కోసం ప్రయత్నించగా.. రన్బీర్ కపూర్ అతని ఫోన్ ను తీసుకొని విసిరేశాడు. 

అయితే, అభిమాని సెల్ఫీ కోసం వచ్చిన సమయంలో రన్బీర్ నవ్వుతూనే అతనికి ఫొటో తీసుకునేందుకు అవకాశం ఇచ్చారు. మరోమారు సెల్ఫీ తీసేందుకూ ప్రయత్నించినా స్మైల్ ఇచ్చారు. ఫొటో సరిగా రాకపోవడం వల్లో.. ఫోన్ పనిచేయకపోవడం వల్లో ఆ అభిమాని మూడోసారి కూడా ఫొటో తీసే క్రమంలో రన్బీర్ సహనం కోల్పోయాడు. అతని ఫోన్ చూడటానికని తీసుకొని వెనక్కి విసిరేశాడు. ఇంతకీ ఏమైందనే దానిపై నెటిజన్లు రకరకాలు కామెంట్లు పెడుతున్నారు. 

రన్బీర్ అలాంటి వాడు కాదని, వీడియో పూర్తిగా లేకపోవడంతో ఆ అభిమానికి ఏదైనా సర్ ప్రైజ్ ఇచ్చాడేమో అని అంటున్నారు. ఎక్కువ శాతం మాత్రం ఇది నమ్మశక్యంగా లేదంటున్నారు. అయితే, ఓ బ్రాండ్ కు సంబంధించిన ఫోన్ అడ్వర్టైజ్ మెంట్ కోసం తీసిన యాడ్ ఫిల్మ్ అంటున్నారు. భిన్నంగా తమ ప్రాడక్ట్స్ ను ప్రచారం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అంతేకానీ రన్బీర్ ను తప్పుగా భావించొద్దని ఫ్యాన్స్ అంటున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. 

ఇక గతేడాది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ను పెళ్లి చేసుకున్న రన్బీర్ కపూర్ కొద్దినెలలకే తండ్రి కూడా అయ్యారు. ప్రస్తుతం సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ‘యానిమల్’ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.  రన్బీర్ కపూర్ - రష్మిక మందన్న జంటగా నటిస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ లుక్  పోస్టర్ కు మంచి రెస్పాన్స్ దక్కుతోంది. టీ-సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్, సినీ 1 స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 11న చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో రిలీజ్ చేయనున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios