బీబీసీ ప్రతినిథికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు బాలీవుడ్ యంగ్ స్టార్ హీర్ రణ్ బీర్ కపూర్. బాలీవుడ్ పరిస్థితి గురించి అడిగిన ప్రశ్నకు ఆయన నవ్వుతూనే చురకలేశారు.
బాలీవుడ్ పరిస్థితి మొన్నటి వరకూ ఎలా ఉందో అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు కూడా పెద్ద మార్పు లేదు కాని.. షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీ మాత్రం వెయ్యి కోట్ల కలెక్షన్లు దాటి పరుగులు తీస్తోంది. ఈక్రమంలోనే బాలీవుడ్ కుమంచిరోజులు వచ్చాయంటూ సంబరాలు చేసుకుంటున్నారు బీ టౌన్ తారలు ఈక్రమంలో కొన్ని సార్లు తమను విమర్షించిన వారికి స్ట్రాంగ్ గా కౌంటర్లు కూడా ఇస్తున్నారు. ఈక్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ ఇలానే ఓ మీడియా సంస్థ ప్రతినిధికి సమాధానం చెప్పారు.
బ్రహ్మాస్త్ర సినిమాతో సక్ససె సాధించి.. వరుస సినిమాలు సెట్స్ ఎక్కిస్తున్నాడు రణ్ బీర్ కపూర్. పెళ్లి వెంటనే కూతురు పుట్టడంతో కొన్ని రోజులు ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేసి.. ఇక వర్క్ మూడ్ లోకి వచ్చేశాడు రణ్ బీర్. ఇక తన నెక్ట్స్ మూవీ తూ ఝూటీ మే మక్కార్ ను సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేశారు. త్వరలో రిలీజ్ కు రెడీగా ఉన్న ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా అంతే స్పీడ్ గా చేస్తున్నాడు యంగ్ హీరో. ఇక ఈ సందర్భంగా రణ్‌బీర్ కపూర్ ఓ మీడియా సమావేశంలో పాల్గొనడం.. అందులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
ఈ సమావేశానికి వచ్చిన బీబీసీ జర్నలిస్టుకు ఆయన ఊహించని ఝలక్ ఇచ్చారు. బాలీవుడ్ సినిమాలు వసూళ్ల పరంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి కదా..? దాని మీద మీరు ఏమంటారు అంటూ అడిగిన మొదటి ప్రశ్నకు రణ్ బీర్ కపూర్ ఘాటుగా సమాధానం చెప్పాు.. రణ్‌బీర్ మాట్లాడుతూ.. అదేంటండీ అలా అంటారు? పఠాన్ సినిమా కలెక్షన్ల గురించి మీకు తెలియదా? అని ఎదురు ప్రశ్న వేశారు. దీంతో.. ఆ జర్నలిస్టు మరో ప్రశ్న వేయబోతుండగా రణ్‌బీర్ మళ్లీ కల్పించుకున్నారు. ముందు మీరు అసలు ఏ పబ్లికేషన్ నుంచి వచ్చారో చెప్పండి. ఇప్పుడు మీ కంపెనీ టైం బాలేనట్టు ఉందిగా. ముందు దాని గురించి చెప్పండి అంటూ సరదాగా చురకలు వేశారు. దీంతో అక్కడున్న అందరు నవ్వుకున్నార.
ఇక బీబీసీ సంస్థపై ఐటీ రైట్స్ ను ఉద్దేశిస్తూ.. రణ్ బీర్ కపూర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక పఠాన్ ఇచ్చిన ధైర్యంతో బాలీవుడ్ స్టార్స్ కాస్త కాన్ఫీడెంట్ వచ్చింది. దాంతో బాలీవుడ్ గురించి ఎవరైనా తక్కువగా మాట్లాడినా.. కౌంటర్ ఇవ్వాలని చూసినా.. వారికి రివర్స్ కౌంటర్ ిచ్చే పని పెట్టుకున్నారు. అయితే పఠాన్ తరువాత వరుసగా సినిమాలు మంచి కలెక్షన్స్ తో హిట్ టాక్ తెచ్చుకుంటే బాలీవుడ్ ఫామ్ లోకి వచ్చే అవకాశం ఉంది. చూడాలి మరి బాలీవుడ్ కు నిజంగా మంచి రోజులు వచ్చాయా..? ఏక పఠాన్ తరువాత పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుందా..?
