బాలీవుడ్ లో పలు సినిమాలకు డాన్సర్ గా పనిచేసిన అభిజీత్ షిండే రణబీర్ కపూర్, రణవీర్ సింగ్ వంటి హీరోలతో కలిసి వర్క్ చేశారు. ఇప్పుడు అతడు ఆత్మహత్య చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.
బాలీవుడ్ లో పలు సినిమాలకు డాన్సర్ గా పనిచేసిన అభిజీత్ షిండే రణబీర్ కపూర్, రణవీర్ సింగ్ వంటి హీరోలతో కలిసి వర్క్ చేశారు. ఇప్పుడు అతడు ఆత్మహత్య చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. పోలీసులు ఈ కేసుని విచారిస్తున్నారు.
తన నివాసంతో ఫ్యాన్ సీలింగ్ కి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు షిండే. అతడు చనిపోయిన చోట పోలీసులకు సూసైడ్ లెటర్ దొరికింది. అందులో తన బ్యాంకు ఖాతాను తన కూతురి పేరు మీద ట్రాన్స్ఫర్ చేయమని ఉంది. షిండే ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను పోలీసులు తెలుసుకునే పనిలో పడ్డారు. చాలా కాలంగా కుటుంబానికి దూరంగా ఉంటోన్న షిండే డిప్రెషన్ తో బాధ పడేవాడని తెలుస్తోంది.
కొన్ని నెలలుగా డిప్రెషన్ లో ఉంటోన్న అతడు ఆత్మహత్య చేసుకొని ఉంటాడని అంచనా వేస్తున్నారు. కుటుంబంలో కలహాల కారణంగా తన మూడేళ్ల కూతురిని కూడా షిండే కలవకుండా చేసేవారని పోలీసులు చెబుతున్నారు.
