ఈ శుక్రవారం నాడు అరడజనుకి పైగా సినిమాలు విడుదలయ్యాయి. అందులో బాలీవుడ్ సినిమా 'కబీర్ సింగ్' కూడా ఉంది. రెండేళ్ల క్రితం తెలుగులో పెద్ద సక్సెస్ అందుకున్న 'అర్జున్ రెడ్డి' సినిమాకు రీమేక్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు.

ఒరిజినల్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ వెర్షన్ ని డైరెక్ట్ చేశాడు. అయితే ఈ సినిమాతో సందీప్ రెడ్డి సక్సెస్ అనుకుంటాడా..? లేదా..? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో  నెలకొంది. ఎట్టకేలకు ఈ సినిమాకి హిట్ టాక్ రావడం విశేషం.

విమర్శించే వారు ఉన్నప్పటికీ ఎక్కువ శాతం మంది ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటోంది. 'అర్జున్ రెడ్డి' సినిమా చూసిన వారు సైతం ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు. షాహిద్ లాంటి అనుభవజ్ఞుడు, మంచి పెర్ఫార్మన్స్ కనబరిచే హీరోని ఎన్నుకొని సందీప్ మంచి పని చేశాడని అంటున్నారు.

కియారా అద్వానీ పెర్ఫార్మన్స్ మరో రేంజ్ లో ఉందని, కథలోని సోల్ మిస్ అవ్వకుండా చూడడంలో సందీప్ సక్సెస్ అయ్యాడని అంటున్నారు. సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాదు.. సెలబ్రిటీలు సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ లు చేస్తున్నారు.