సినిమాల్లో ప్రేమ కోసం తపించే హీరో, హీరోయిన్లు నిజ జీవితంలో ప్రేమను పొందలేక, బ్రేకప్ చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. మరి నిజ జీవితంలో ప్రేమించి బ్రేకప్ చెప్పుకున్న జంటలు ఎవరు? నిజమెంత

సినిమాల్లో కొన్ని జంటల ప్రేమకథలు చూసి మన ప్రేమ కూడా ఇలా ఉంటే బాగుండు అనుకునేవాళ్ళు ఉంటారు. కానీ సినిమాల్లో కొన్ని ప్రేమకథలు అసంపూర్తిగా ఉన్నట్టే కొంతమంది స్టార్స్ నిజ జీవిత ప్రేమకథలు కూడా అసంపూర్ణంగా ఉన్నాయి. చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వీరు, చివరకు బ్రేకప్ చెప్పుకున్నారు. ఇంతకీ ఆ జంటలెవరంటే? 

ప్రీతి జింటా

2005లో నటి ప్రీతి జింటా నెస్ వాడియాతో డేటింగ్ ప్రారంభించింది. వారి సంబంధం మీడియా ముందు బయటపడింది. 2007లో ఈ జంట నటి ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ వివాహంలో పాల్గొంది. 2008లో ఐపీఎల్ జట్టు కింగ్స్ పంజాబ్‌కి సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు. 2009లో ఈ జంట విడిపోయింది. 2014లో ప్రీతి జింటా నెస్ వాడియాపై ఫిర్యాదు చేసింది. బెదిరింపులు, వేధింపులు, దుర్భాషలాడటం వంటి ఆరోపణలు చేసింది. బహిరంగంగా అవమానించడం, ముఖంపై సిగరెట్ తో కాల్చడం వంటి ఆరోపణలు కూడా చేసింది. పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మొహమ్మద్ అలీ జిన్నా మనవడు నెస్ వాడియా. ఆ తర్వాత ప్రీతి అమెరికన్ జీన్ గుడెనౌఫ్‌ని వివాహం చేసుకుంది. ఇప్పుడు ఈ జంట కవల పిల్లలకు తల్లిదండ్రులు.

సల్మాన్ ఖాన్ - ఐశ్వర్య రాయ్

నటుడు సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్ ‘హమ్ దిల్ దే చుకే సనం’ సినిమా సమయంలో ప్రేమలో పడ్డారు. సల్మాన్ ఖాన్‌పై ఐశ్వర్య రాయ్ తీవ్ర ఆరోపణలు చేసింది. పొసెసివ్‌నెస్, శారీరక వేధింపులు, సినిమా షూటింగ్‌లకు అంతరాయం కలిగించడం, ఇంట్లో కూడా వేధించడం వంటి ఆరోపణలు చేసింది. బ్రేకప్ తర్వాత కూడా పదే పదే ఫోన్ చేయడం, మానసికంగా వేధించడం వంటి ఆరోపణలు చేసింది. ఆ తర్వాత వివేక్ ఒబెరాయ్‌తో ఐశ్వర్య ప్రేమలో పడింది. వివేక్‌కి కూడా సల్మాన్ ఖాన్ ఫోన్ చేసి బెదిరించాడని బాలీవుడ్ లో టాక్. ఇందులో నిజం ఎంతో తెలియదు కాని.. వివేక్ ఒబెరాయ్ చాలాసార్లు బహిరంగంగా క్షమాపణలు చెప్పినా సల్మాన్ ఎప్పుడూ అతనితో స్నేహం చేయలేదు. 2007లో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ వివాహం చేసుకున్నారు.

దీపికా పదుకొణ - రణ్‌బీర్ కపూర్

నటి దీపికా పదుకొణ, రణ్‌బీర్ కపూర్ కొన్నేళ్లు డేటింగ్ చేశారు. కానీ ఈ సంబంధం పెళ్లి వరకు వెళ్ళలేదు. “రణ్‌బీర్ కపూర్ నన్ను రెండుసార్లు మోసం చేశాడు. అని దీపికా చెప్పింది. అప్పుడు రణ్‌బీర్ కపూర్ కూడా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకున్నట్టు అనిపించలేదు. 2018లో దీపికా పదుకొణ, రణ్‌వీర్ సింగ్ వివాహం చేసుకున్నారు. 2022లో ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ వివాహం చేసుకున్నారు.

కంగనా రనౌత్, హృతిక్ రోషన్

కంగనా రనౌత్, హృతిక్ రోషన్ సంబంధం కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. కంగనాను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చిన హృతిక్ రోషన్ ‘క్వీన్’ సినిమా విడుదల సమయంలో బ్రేకప్ చెప్పాడట. కంగనాతో సంబంధం గురించి హృతిక్ రోషన్ ఎప్పుడూ ఏమీ చెప్పలేదు. సుజానే ఖాన్‌ని వివాహం చేసుకున్న హృతిక్ ఆ తర్వాత విడాకులు తీసుకున్నాడు. నాకు 100 ఈమెయిల్స్ పంపించిందని హృతిక్ కంగనాపై ఆరోపణ చేశాడు. కానీ ఈ కేసుకు సరైన ముగింపు రాలేదు. ఇప్పుడు హృతిక్ మరో నటితో సంబంధంలో ఉన్నాడు.

కరీనా కపూర్ - షాహిద్ కపూర్

కరీనా కపూర్, షాహిద్ కపూర్ 2004లో ‘ఫిదా’ సినిమా సమయంలో డేటింగ్ ప్రారంభించారు. కరీనా కపూరే షాహిద్‌కి ప్రేమను వ్యక్తం చేసింది. 2007లో ‘జబ్ వి మెట్’ సినిమా విడుదల సమయానికి ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్, కరీనా డేటింగ్ ప్రారంభించారు. కరీనాతో మళ్ళీ కలిసి పని చేస్తారా అని షాహిద్‌ని అడిగినప్పుడు, “దర్శకుడు చెబితే నేను ఆవు, గేదెతో కూడా పని చేస్తా” అని అన్నాడు. 2012లో కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ వివాహం చేసుకున్నారు. 2015లో షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్ వివాహం చేసుకున్నారు. బ్రేకప్ తర్వాత ఎప్పుడూ మాట్లాడని ఈ జంట కొన్ని నెలల క్రితం ఒక సినిమా కార్యక్రమంలో కలుసుకుని మాట్లాడుకున్నారు.