Asianet News TeluguAsianet News Telugu

కోడలికి షాక్ ఇచ్చిన అమితాబ్ బచ్చన్, లిస్ట్ నుంచి ఐశ్వర్యరాయ్ ఔట్..?

అసలు బచ్చన్ ఫ్యామిలీలో ఏం జరుగుతుంది. చాలా కాలంగా ఐశ్వర్య, అభిషేక్ విడాకులు వార్తలు వైరల్ అవుతున్న క్రమంలో.. తాజాగా బిగ్ బీ..తన కోడులు ఐశ్వర్యను సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయడం.. చర్చనీయాంశం గా మారింది. 
 

Bollywood Big B Amitabh Bachchan Unfollow Aishwarya Rai JMS
Author
First Published Dec 10, 2023, 10:45 AM IST

గత కొంత కాలంగా బిగ్ బీ ఫ్యామిలీలో ఏదో జరుగుతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే పరిణామలు డౌట్ ఫుల్ గా ఉంటుంన్నాయి. ముఖ్యంగా అభిషేక్  బచ్చన్.. తో ఐశ్వర్యరాయ్ విడాకుల వార్తలు నెట్టింట వేడి పుట్టిస్తున్నాయి. కొంత కాలం క్రితం ఈ వార్తలు హల్ చల్ చేయగా.. తాజాగా మరోసారి వీడి విడాకులు వార్తలు హైలెట్ అవుతూ వచ్చాయి.  ఎప్పుడూ... ఎక్కడికి వెళ్లినా.. కలిసి మెలిసి వెళ్తారు ఈ జంట. కాని ఈమధ్య కాలంలో ఏ కార్యక్రమానికి అయినా.. కూతురు ఆధ్యాను తీసుకుని ఐశ్వర్య రాయ్ మాత్రమే వెళ్తుండటం అందరికి అనుమానం రేకెత్తించింది.

 అయితే ఈ విషయంలో అభిషేక్ వివరణ ఇచ్చినా.. నెటిజన్లు మాత్రం సంతృప్తి చెందలేదు. దాంతో మరోసారి ఈ విషయం బయటకు వస్తూనేఉంది. ఇక ఈమధ్య జరిగిన ఓ సంఘటన మరోసారి అమితాబ్ ఫ్యామిలీలో ఏదో జరుగుతుంది అని మరోసారి అనుమానం వచ్చేలా చేసింది. ఇంతకీ విషయం ఏంటంటే.. బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్ తన కోడలు ఐశ్వర్య రాయ్‌ను ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేశారు. ఆయన చేశారా.. లేకు అలా జరిగిపోయిందా అన్నది ప్రస్తుతం  సంచలనంగా మారింది. బిగ్ బీ మొత్తం 74 మంది సెలబ్రిటీలను ఫాలో అవుతారు. 

Bollywood Big B Amitabh Bachchan Unfollow Aishwarya Rai JMS

సల్మాన్ ఖాన్, అభిషేక్ బచ్చన్, కత్రినా కైఫ్ వంటి స్టార్లు ఈ జాబితాలో ఉన్నారు. అయితే, లిస్టులో ఐశ్వర్య కనిపించకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చేస్తుందా అన్న అనుమానం పెరుగుతోంది. అయితే రీసెంట్ గా జరిగిన వేడుకల్లో మాత్రం అంతా హ్యాపీగా కనిపించారు. అమితాబ్ మనవడు అగస్త్య నంద నటించిన ది ఆర్చీస్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. అయితే ఈ మూవీ రిలీజ్ కు ముందు  ముంబైలో ప్రీమియర్స్  ప్రదర్శణ జరిగింది. ఈమూవీ  ప్రీమియర్‌కు అమితాబ్ కుటుంబసమేతంగా హాజరయ్యారు. ఐశ్వర్య, అమితాబ్..ఇలా అందరూ సంతోషంగా కెమెరాలకు పోజులిస్తూ కనిపించారు. 

అయితే ఇంతలోనే ఇలా అమితాబ్ ఐశ్వర్యను అన్‌ఫాలో అయిన వార్త వైరల్‌గా మారింది. అయితే.. ఈ విషయంలో బచ్చన్ ఫ్యామిలీ ఫ్యాన్స్ మాత్రం డిఫరెంట్ గా స్పందిస్తున్నారు. ఈ  వార్తలను కొట్టిపారేస్తున్నారు. అమితాబ్ ఇన్‌స్టా అకౌంట్ సెట్టింగ్స్  ఏమైనా ప్రాబ్లమ్ వచ్చి ఉంటాయి.. అందకే.. ఇలా జరిగి ఉంటుంది అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజం ఎంతా..? నిజంగా అభిషేక్, ఐశ్వర్య విడిపోతున్నారన్నార. ఈ విషయం అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios