Karisma Sharma: బాలీవుడ్ నటి కరిష్మా శర్మ ముంబైలో కదులుతున్న రైలు నుంచి దూకి తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

Karisma Sharma: బాలీవుడ్‌ లో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న రైలు నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం గురించి ఆమె స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఈ ఘటన ఎలా జరిగింది?

ఆ హీరోయిన్ ఎవరో కాదు. బాలీవుడ్ నటి కరిష్మా శర్మ ( Karisma Sharma). రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్, ప్యార్ కా పంచనామా 2 వంటి సినిమాలతో ఫేమ్ తెచ్చుకున్న కరిష్మా ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. ముంబైలో కదులుతున్న రైలు నుంచి దూకడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం గురించి ఆమె స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వైరల్‌గా మారింది.

ప్రమాదం ఎలా జరిగింది?

కరిష్మా శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ సంఘటన గురించి వివరించారు. ''నిన్న ఓ సినిమా షూటింగ్ స్పాట్‌కు వెళ్లడానికి బయల్దేరాను. ముంబై లోకల్ రైలు ఎక్కగానే అది వేగంగా కదిలింది. అయితే.. ఆ రైలును నా స్నేహితులు అందుకోలేకపోయారు. దీంతో నాలో ఒకసారిగా భయం, టెన్షన్‌. దీంతోనే నేను కదులుతున్న రైలు నుంచి దూకేశాను. దురదృష్టవశాత్తూ వెనక్కి పడటంతో నా వీపు, తలకు గాయాలు అయ్యాయి. తలకు గాయం కావడంతో వైద్యులు MRI స్కాన్ అవసరమని సూచించారు, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నా.'' అని ఆమె రాసుకొచ్చారు

స్నేహితురాలి భావోద్వేగం

కరిష్మా సన్నిహిత స్నేహితురాలు సోషల్ మీడియాలో స్పందిస్తూ.. “ఇది జరిగినా నమ్మలేకపోతున్నాను. ప్రమాదం తర్వాత ఆమె స్పృహ కోల్పోయింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాం. ప్రస్తుతం డాక్టర్లు ఆమెను క్లోజ్ మానిటరింగ్‌లో ఉంచారు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని పేర్కొంది.

సినీ జర్నీ

కరిష్మా శర్మ ఇప్పటివరకు పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ షోలలో నటించి ప్రేక్షకులను అలరించారు. ఫసాటే ఫసాటే, సూపర్ 30, ఏక్ విలన్ రిటర్న్స్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే పవిత్ర రిష్తా, యే హై మొహబ్బతే, ప్యార్ తునే క్యా కియా వంటి టెలివిజన్ సీరియల్స్‌లో కూడా నటించారు.

ఈ సంఘటనతో ముంబై లోకల్ రైలు ప్రయాణాల్లో భద్రతపై మరల చర్చ మొదలైంది. చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాలకు ముప్పు తెస్తుందని ఈ ఘటన గుర్తు చేసింది.ప్రస్తుతం కరిష్మా శర్మ ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు సమాచారం. అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.