Asianet News TeluguAsianet News Telugu

కల్కి మూవీపై ప్రముఖ బాలీవుడ్ నటుడు తీవ్ర ఆగ్రహం..శ్రీకృష్ణుడు, అశ్వథామ సన్నివేశాలు అబద్దాలే 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం వరల్డ్ వైడ్ గా 700 కోట్ల గ్రాస్ తో ప్రభంజనం సృష్టిస్తోంది. మొదటి వారం ముగిసినప్పటికీ కల్కి చిత్ర జోరు తగ్గడం లేదు. 

Bollywood Actor Mukesh Khanna fires on Prabhas Kalki 2898 AD movie dtr
Author
First Published Jul 4, 2024, 6:24 PM IST | Last Updated Jul 4, 2024, 6:24 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం వరల్డ్ వైడ్ గా 700 కోట్ల గ్రాస్ తో ప్రభంజనం సృష్టిస్తోంది. మొదటి వారం ముగిసినప్పటికీ కల్కి చిత్ర జోరు తగ్గడం లేదు. మహా భారతంలోని అంశాలతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ కథ సృష్టించి విజువల్స్ మాయాజాలం అందించారు. 

దీనితో ఆడియన్స్ కల్కి చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. అయితే ఈ చిత్రంలో మహాభారతంలోని సన్నివేశాల పట్ల కొన్ని వార్తల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ చిత్రం రిలీజ్ కాగానే కర్ణుడు గొప్పవాడా ? అర్జునుడు గొప్పవాడా ? అనే చర్చ కూడా సోషల్ మీడియాలో ఎక్కువైంది. 

అయితే తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటుడు ముఖేష్ ఖన్నా కల్కి చిత్రంలో చూపించిన మహాభారతంలోని సన్నివేశాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్కి చిత్రం విజువల్ గా బాగా ఉంది. కానీ మహాభారతంలో సన్నివేశాలని పూర్తిగా వక్రీకరించారు. ఇలా చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు అని అన్నారు. 

ఓ ఇంటర్వ్యూలో ముఖేష్ ఖన్నా మాట్లాడుతూ.. శ్రీకృష్ణుడు అశ్వథామని వేసుకున్నట్లు చూపించారు. శ్రీకృష్ణుడు అశ్వథామ మణిని తొలగించడం.. భవిష్యత్తులో నువ్వే నాకు రక్షణ కల్పించాలి వేడుకోవడం మహాభారతంలో ఎక్కడా లేదు. మీకు వ్యాసునికంటే ఎక్కువగా తెలుసా అని ఆయన కల్కి చిత్ర యూనిట్ ని ప్రశ్నించారు. 

నేను చిన్నప్పటి నుంచి మహాభారతం చదువుతున్నా.. కృష్ణుడు అశ్వథామతో అలా చెప్పినట్లు ఎక్కడా లేదు అని అన్నారు. అంత శక్తివంతుడైన శ్రీకృష్ణడు.. అశ్వథామని భవిష్యత్తులో తనని రక్షించమని అడగడం ఏంటి. ఇవన్నీ క్షమించరాని తప్పులు అని ముఖేష్ ఖన్నా తెలిపారు. ఇలాంటి చిత్రాల స్క్రిప్ట్స్ ని పరిశీలించేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీతో బోర్డుని నియమించాలని కోరారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios