నటుడు గోవిందా నవంబర్ 11న ఇంట్లో స్పృహతప్పి పడిపోవడంతో ముంబైలోని ఆసుపత్రిలో చేరారు. ఆయనకు డాక్టర్లు  కొన్ని పరీక్షలు చేశారు, రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నారు. 

బాలీవుడ్ నటుడు గోవిందాను నవంబర్ 11వ తేదీ రాత్రి ముంబైలోని క్రిటికేర్ ఆసియా మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్చారు. మీడియా కథనాల ప్రకారం, ఆయన తన ఇంట్లో స్పృహతప్పి పడిపోయారు, ఆ తర్వాత కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ వార్త విన్న అభిమానులు షాక్ అయ్యారు, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

గోవిందా ఆరోగ్య పరిస్థితి

గోవిందా ఆరోగ్య పరిస్థితిపై ఆయన స్నేహితుడు, న్యాయ సలహాదారు లలిత్ బిందాల్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.., 'డాక్టర్ల సలహా మేరకు ఆయనకు మందులు ఇచ్చి, రాత్రి ఒంటి గంటకు ఎమర్జెన్సీలో చేర్చారు' అని చెప్పారు. గోవిందాకు చాలా పరీక్షలు చేశారని, వాటి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది. ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి ఇంకా ఎలాంటి సమాచారం చెప్పలేమన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, గోవిందా ఆసుపత్రిలో చేరడానికి ఒక రోజు ముందు, ప్రముఖ నటుడు ధర్మేంద్రను కలవడానికి ఆసుపత్రికి వెళ్లారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రి బయట నుంచి గోవిందా కారు నడుపుకుంటూ వస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

ధర్మేంద్రను చూడటానికి ఆసుపత్రికి వెళ్లిన గోవిందా

గోవిందా ఆసుపత్రిలో చేరడానికి ఒక రోజు ముందు, ప్రముఖ నటుడు ధర్మేంద్రను కలవడానికి ఆసుపత్రికి వెళ్లారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి వెళ్లి అక్కడ దర్మేంద్ర ఫ్యామిలీతో ఆయన మాట్లాడారు, స్టార్ నటుడి ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. ఆతరువాత ఆయనే స్యయంగా కారు నడుపుకుంటూ బయటకు వస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఏడాదిలో గోవిందా రెండోసారి ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. గత ఏడాది అక్టోబర్ 1న ఆయనకు ప్రమాదం జరిగింది, ఆ తర్వాత ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. ఆయన లైసెన్స్ ఉన్న రివాల్వర్ నుంచి పొరపాటున బుల్లెట్ పేలి, మోకాలికి గాయమైందని సమాచారం.

View post on Instagram

గోవిందా సినిమాలు 

గోవిందా 1980, 1990 దశకాల్లో 'ఇల్జామ్' (1986), 'లవ్ 86' (1986), 'ఇష్క్ మే జీనా ఇష్క్ మే మర్నా' (1994) వంటి సినిమాలతో స్టార్ నటుడిగా ఎదిగారు. ారు. డేవిడ్ ధావన్ వంటి దర్శకులతో ఆయన చేసిన 'కూలీ నెం.1', 'హీరో నెం.1', 'రాజా బాబు', 'పార్ట్‌నర్' వంటి చిత్రాలు హిట్ అయ్యాయి. గోవిందా చివరిసారిగా 2019లో వచ్చిన 'రంగీలా రాజా' చిత్రంలో కనిపించారు.