స్కంద మూవీలో ఈ బ్లండర్ మిస్టేక్ గమనించారా..? బోయపాటిని ఏకిపారేస్తున్న నెటిజెన్స్!
సినిమా విడుదలకు ముందు మేకర్స్ ఒకటికి పదిసార్లు చూస్తారు. అయినా ఎక్కడో ఓ చోట తప్పు చేస్తారు. సినిమా అనేది చిన్న విషయం కాదు. సాధారణంగా మిస్టేక్స్ జరుగుతుంటాయి.

దర్శకుడు బోయపాటి శ్రీను-రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన స్కంద నిరాశపరిచింది. సలార్ విడుదల పోస్ట్ పోన్ కావడంతో ప్రభాస్ బుక్ చేసుకున్న సెప్టెంబర్ 28ని స్కంద కబ్జా చేసింది. లాంగ్ వీకెండ్, హాలిడేస్ దొరికినా ఫలితం మారలేదు. రెగ్యులర్ డేట్స్ లో వస్తే స్కంద ఫలితం మరింత దారుణంగా ఉండేదేమో. పాన్ ఇండియా మూవీ అంటూ భారీగా హైప్ పెంచారు. దాంతో పెద్ద మొత్తంలో థియేట్రికల్ హక్కులు విక్రయించారు. దాని వలన ఎక్కువ నష్టాలు మిగిల్చింది స్కంద మూవీ.
స్కంద విడుదలై నాలుగు వారాలు ముగియగా ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. హాట్ స్టార్ స్కంద డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంది. హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుండగా ఓ మోస్తరు రెస్పాన్స్ దక్కుతుంది. కాగా స్కంద మూవీలోని ఓ బ్లండర్ మిస్టేక్ వెలుగులోకి వచ్చింది. స్కంద మూవీ చూసిన ప్రేక్షకుడు ఈ విషయం బహిర్గతం చేశాడు.
సీఎం పాత్ర చేసిన శరత్ లోహితశ్వ- రామ్ పోతినేని మధ్య ఓ హీటెడ్ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. ఈ సన్నివేశంలో రామ్ పోతినేని ఓ వ్యక్తిని గన్ తో కాల్చి చంపుతాడు. దానికి శరత్ షాకింగ్ రియాక్షన్ ఇస్తాడు. రామ్ చేతిలో చనిపోయిన వ్యక్తి... శరత్ వెనుక షాట్ లో కనిపిస్తున్నాడు. ఇంత పెద్ద మిస్టేక్ గమనించకపోవడం ఏంటని బోయపాటిని సోషల్ మీడియా జనాలు ఏకిపారేస్తున్నారు.
స్కందకు సంబంధించిన ఈ వీడియో వైరల్ గా మారింది. స్కందతో మరో ప్లాప్ రామ్ పోతినేని ఖాతాలో పడింది. స్కందలో రామ్ కి జంటగా శ్రీలీల నటించింది. థమన్ సంగీతం అందించారు. థమన్ సాంగ్స్, బీజీఎమ్ సైతం నెగిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. ఇటీవల థమన్ సీన్స్ లో దమ్ములేకపోతే మంచి బీజీఎమ్ ఇవ్వలేమని అన్నాడు. ఆ మాట స్కందను ఉద్దేశించి అన్నాడనే వాదన వినిపించింది.