RRR Movie-NTR: మీ వెలకట్టలేని ప్రేమకు కృతజ్ఞతలు- ఎన్టీఆర్ 

మార్చి 25 ఆర్ ఆర్ ఆర్ డే అని చెప్పాలి. ఎన్టీఆర్, రామ్ చరణ్ ల మల్టీస్టారర్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఆర్ ఆర్ ఆర్ మూవీతో నయా రికార్డ్స్ నమోదు కావడం ఖాయం అంటున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.

block buster talk for rrr movie ntr thanks his fans and audience

యూఎస్ తో పాటు దేశవ్యాప్తంగా ఆర్ ఆర్ ఆర్ మూవీ (RRR Movie)ప్రీమియర్స్ ప్రదర్శన జోరుగా సాగింది. దీంతో అర్థరాత్రి దాటే సమయానికి టాక్ బయటికొచ్చేసింది. సినిమా చూసిన ప్రతి ప్రేక్షకులు ఆర్ ఆర్ ఆర్ మూవీ అద్భుతమన్న అభిప్రాయం వెళ్లబుచ్చారు. రాజమౌళి తన జైత్రయాత్ర కొనసాగిస్తూ.. ఎప్పటికీ నిరుత్సాహపరడని ఆర్ ఆర్ ఆర్ తో మరోసారి రుజువు చేసుకున్నారు. బలమైన ఎమోషన్స్ కి గూస్ బంప్స్ కలిగించే యాక్షన్ సన్నివేశాలు జోడించి, సినిమాను రాజమౌళి అద్భుతంగా మలిచారు. 

ఇక ఇద్దరు హీరోలు చరణ్, ఎన్టీఆర్ (NTR)ల నటన వాళ్ళ కెరీర్ బెస్ట్ అని చెప్పాలి. మొత్తంగా ఆర్ ఆర్ ఆర్ మరో అద్భుత చిత్రంగా నిలిచిపోనుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రేక్షకులు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. మీ వెలకట్టలేని ప్రేమాభిమానాలకు కృతఙ్ఞతలు. అవే నన్ను మరింత ముందుకు తీసుకెళ్తాయి. విజువల్ వండర్ ఆర్ ఆర్ ఆర్ సినిమాను చూసి ఆనందించండి... అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ట్వీట్ వైరల్ గా మారింది. 

కాగా ఎన్టీఆర్ హైదరాబాద్ లోని ఏఎంబీ మాల్ లో తన ఫ్యామిలీతో కలిసి సినిమాను చూశారు. ఫ్యాన్స్ తో కలిసి, కుటుంబ సమేతంగా ఆర్ఆర్ఆర్ చూడటం పట్ల చాలా సంతోషం వ్యక్తం చేశారు. అయితే థియేటర్ నుంచి బయటికి వస్తూ..  రెండు చేతులతో సూపర్ అంటూ ఫ్యాన్స్ కు అభివాదం చేశాడు. సూపర్ హిట్, మాటల్లేవు అంటూ తను ఇచ్చిన రియాక్షన్ కు అభిమానులు ఫిదా అయ్యారు. 

అలాగే ఎస్ ఎస్ రాజమౌళి, రామ్ చరణ్ (Ram Charan)ఇద్దరూ భ్రమరాంబ థియేటర్ లో  ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూశారు. అయితే ఈ థియేటర్ వద్ద రాజమౌళి, చెర్రీ ఫ్యాన్స్ నుంచి కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్సు నుంచి థియేటర్ హాల్ కు చేరుకునేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. థియేటర్ వద్ద రామ్ చరణ్ కనిపించడంతో చెర్రీ ఫ్యాన్స్ ఒకేసారి ఆయన వద్దకు చేరుకునే  ప్రయత్నం చేశారు. కానీ సెక్యూరిటీ వారిని అడ్డుకుని సేఫ్టీగా థియేటర్ లోకి తీసుకెళ్లారు. ఈ హడావుడిలో రామ్ చరణ్ షూ కూడా ఊడిపోయింది. అయినా చరణ్ తన ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. 

ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఎన్టీఆర్, చరణ్... కొమరం భీమ్, రామరాజు పాత్రలు చేశారు. ఒలీవియా మోరిస్, అలియా భట్ హీరోయిన్స్ గా నటించారు. అజయ్ దేవ్ గణ్, సముద్రఖని కీలక రోల్స్ చేశారు. డివివి దానయ్య రూ. 500 కోట్ల బడ్జెట్ తో ఆర్ ఆర్ ఆర్ నిర్మించారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios