Asianet News TeluguAsianet News Telugu

భార్యను వాడుకుని రాజ్‌ కుంద్రా రూ.3 వేల కోట్లు సంపాదించారా?

మూడు వేల కోట్ల రూపాయలను ఆన్ లైన్ గేమ్‌ తో సామాన్య జనాలను మోసం చేసిన రాజ్ కుంద్రా అందుకు గాను భార్య శిల్పా శెట్టిని వినియోగించుకున్నాడటంతో సెన్సేషన్ గా మారింది

BJP leader accuses Raj Kundra of Rs 3,000 crore fraud jsp
Author
Mumbai, First Published Aug 1, 2021, 10:13 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

 ప్రముఖ వ్యాపారవేత్తగా సెలబ్రెటీ హోదాను ఎంజాయ్ చేస్తున్న ‘రాజ్‌ కుంద్రా’ ఒక్కసారిగా అశ్లీల చిత్రాల రారాజు రివీల్ అయ్యాడు.  ఈ క్రమంలో  రాజ్‌ కుంద్రా అరెస్ట్ తర్వాత, ఆయన చుట్టూ ఎన్నో కేసులు వచ్చి చుట్టుకుంటున్నాయి. రోజుకొక కేసు వెలుగులోకి వస్తుండటంతో పోలీసులు కూడా ‘రాజ్‌ కుంద్రా’ వ్యవహారాన్ని స్పెషల్ గా చూసేలా చేస్తున్నాయి.  తాజాగా బీజేపీ నేత రామ్‌ కదం చేసిన వ్యాఖ్యలు రాజ్‌ కుంద్రాను మరింతగా ఇరుకున పెట్టేవిగా ఉన్నాయి.

బీజేపీ నేత రామ్‌ కదం మాట్లాడుతూ.. ‘రాజ్‌ కుంద్రా ఆన్‌ లైన్ గేమ్ పేరుతో దాదాపు రూ.3 వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించాడని ఆయన బలంగా ఆరోపించాడు. అయితే, ఈ సంపాదన వెనుక శిల్పా శెట్టిది చాల కీలక పాత్ర అని.. ఆమె సహకారం వల్లే అతను అక్రమ సంపాదనకు బాగా అలవాటు పడ్డాడని ఆయన విమర్శలు చేశారు.

అలాగే రాజ్‌ కుంద్రా ఆన్‌ లైన్ గేమ్ పేరుతో రూ.3 వేల కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించాడు అంటూ ఆరోపించారు. మూడు వేల కోట్ల రూపాయలను ఆన్ లైన్ గేమ్‌ తో సామాన్య జనాలను మోసం చేసిన రాజ్ కుంద్రా అందుకు గాను భార్య శిల్పా శెట్టిని వినియోగించుకున్నాడటంతో సెన్సేషన్ గా మారింది. ఆమె కు ఉన్న స్టార్ డమ్‌ కారణంగా ఆమె ను బ్రాండ్‌ అంబాసిడర్‌ గా వినియోగించాడు. ఆమె అంబాసిడర్ అవ్వడం వల్ల ఆ గేమ్‌ ను జనాలు విపరీతంగా ఆడి మోసపోయారు అంటూ బీజేపీ నేత ఆరోపించాడు. ఈ విషయమై కూడా ఎంక్వైరీ జరుగుతుందని అంటున్నారు.

డిస్ట్రిబ్యూటర్స్ ఏమంటున్నారు..

ఇక రాజ్ కుంద్రా వ్యవహారం బయిటకు రావటానికి ముందు...గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన హిరేన్ పర్మర్ స్వంత రాష్ట్రంలోని సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ తో పాటూ ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు కూడా రాజ్ కుంద్రా పై కంప్లైంట్ ఇచ్చాడు. ఆయన ఆరోపిస్తున్న దాని ప్రకారం శిల్పా శెట్టి భర్త ఆధీనంలోని ‘వియాన్ ఇండస్ట్రీస్’ అతడ్ని మోసం చేసిందట. 3 లక్షలు తీసుకుని ఓ ఆన్ లైన్ గేమ్ విషయంలో డిస్ట్రిబ్యూటర్ గా చేర్చుకుంటామన్నారట! కానీ, అలాంటిదేం జరగలేదు!

 ‘గేమ్ ఆఫ్‌ డాట్’ పేరుతో తనకు 3 లక్షలు ఎగొట్టి ఆటలో అరటి పండుని చేశారని హిరేన్ గ్రహించాడు. కానీ, తరువాత సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించినా లాభం లేకపోయింది. తాజాగా రాజ్ కుంద్రా అరెస్ట్ తో గుజరాత్ వ్యాపారి హిరేన్ పర్మర్ కూడా బయటకొచ్చాడు. మరోసారి తన డబ్బు తనకు ఇప్పించమని ముంబై పోలీసుల్ని సైతం కంప్లైంట్ లో రిక్వెస్ట్ చేశాడు.

2019లో తనకు జరిగిన మోసానికి ఇప్పుడు న్యాయం కోరుతోన్న గుజరాత్ వ్యాపారి హిరేన్, బాధితులు ఇంకా చాలా మంది ఉన్నారని, చెబుతున్నాడు. రానున్న రోజుల్లో రాజ్ కుంద్రా బాధితులు అంతకంతకూ ఎక్కువయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. కేసులు ఎంతగా పెరిగితే శిల్పా శెట్టికి అంత తలనొప్పి అని చెప్పక తప్పదని తేలుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios