ఇటీవల మంగ్లీ 'చెట్టు క్రింద కూసున్నవమ్మా చుట్టం లెక్క మైసమ్మా.., అనే ఓ బోనాలు సాంగ్ యూట్యూబ్ లో విడుదల చేశారు. ఈ పాటను మంగ్లీ స్వయంగా పాడి, నర్తించడం జరిగింది.
సింగర్ మంగ్లీ తాజా బోనాలు సాంగ్ వివాదంలో చిక్కుకుంది. మంగ్లీ పాడిన బోనాలు సాంగ్ లోని పదాలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ కొందరు ఆమెపై పోలీసులకు పిర్యాదు చేశారు.ఇటీవల మంగ్లీ 'చెట్టు క్రింద కూసున్నవమ్మా చుట్టం లెక్క మైసమ్మా.., అనే ఓ బోనాలు సాంగ్ యూట్యూబ్ లో విడుదల చేశారు. ఈ పాటను మంగ్లీ స్వయంగా పాడి, నర్తించడం జరిగింది. కొద్దిరోజుల క్రితం విడుదలైన ఈ సాంగ్ విశేష ఆదరణ దక్కించుకుంటుంది.
ఈ సాంగ్ లోని లిరిక్స్ అభ్యంతరకరంగా ఉన్నాయని కొందరు హిందూవాదులు మండిపడుతున్నారు. వెంటనే సదరు సాంగ్ లో లిరిక్స్ మార్చాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆ పాటలోని కొన్ని లిరిక్స్ గ్రామ దేవతలను విమర్శిస్తున్నట్లు ఉన్నాయని వాళ్ళ వాదన. ఈ విషయంలో మంగ్లీని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ పాటకు లిరిక్స్ రామస్వామి అందించగా, రాకేష్ వెంకటాపురం స్వరాలు సమకూర్చారు.
తాజాగా ఈ పాట లిరిక్స్ పై అభ్యంతరం తెలుపుతూ బీజేపీ కార్పొరేటర్స్ రాచకొండ పోలీస్ స్టేషన్ లో లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. హిందువుల మనో భావాలు దెబ్బతీసేలా మంగ్లీ పాటలోని పదాలు ఉన్నాయని తెలియజేశారు. అలాగే మంగ్లీ పాడిన సదరు పాట వీడియోను అన్ని సామజిక మాధ్యమాల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. రాజకీయ రంగు పులుముకుంటున్నట్లు కనిపిస్తున్న ఈ వివాదం మరింత పెద్దది అయ్యేలా కనిపిస్తుంది.
