తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) పుట్టిన రోజు కావడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వేదిలాగా పోస్ట్ లు పెడుతూ విషెస్ తెలుపుతున్నారు. అలాగే సినీ తారలూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ ధనుష్ ను ఇలా కోరుకుంటున్నారు.
చిత్ర పరిశ్రమలో భిన్న కథాంశాలు, విభిన్న పాత్రలు పోషిస్తున్న అందనంత ఎత్తుకు ఎదిగారు తమిళ స్టార్ హీరో, వెర్సటైల్ యాక్టర్ ధనుష్ (Dhanush). ఈ రోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు, సినీ తారలు వెలాదిగా పోస్ట్ లు పెడుతూ ఆయనకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో తాజాగా లేడీ విలన్ వరలక్ష్మి శరత్ కుమార్ మరియు సీనియర్ నటి రాధిక శతర్ కుమార్ మారీకి బర్త్ డే విషెస్ తెలిపారు.
గ్లోబల్ రాక్ స్టార్ ధునుష్ కు కేరీర్ లో మరిన్ని విజయాలు సొంతం కావాలని కోరుకుంటున్నారు. ఆయన ఎదుగుతున్న తీరుకు గర్వపడుతున్నట్టు రాధిక, వరలక్ష్మి తమ ట్వీట్లలో తెలిపారు. అలాగే ఆయన జీవితంతో సుఖ:సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. అలాగే ఆయన నటిస్తున్న కొత్త చిత్రాలు ‘వాతీ, తిరుచిత్రంబలం, నానే వరువెన్’ నుంచి కూడా చిత్ర యూనిట్ బర్త్ డే స్పెషల్ పోస్టర్లను పంచుకుంటూ బెస్ట్ విషెస్ ను తెలిపింది. ఆయన బర్త్ డే స్పెషల్ వీడియోలనూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. దీంతో ధనుష్ పట్టలేని ఆనందంలో మునిగి తేలుతున్నారు.
తమిళనాడులోని చెన్నైలో ధనుష్ 1983 జూలై 28న జన్మించారు. ఈ రోజుతో 39వ ఏట అడుగెట్టారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ ఆయన ముందు ఓ గట్టి కోరికనే ఉంచారు. ఇప్పటికే పలు అవార్డులు, పురస్కారాలు అందుకున్న మారన్.. వచ్చే సినిమాలతో మాత్రం ఎలాగైన ‘‘ఆస్కార్ అవార్డు’’ పొందాలని ఆకాంక్షిస్తున్నారు. ఆ దిశగా ధనుష్ సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ధనుష్.. అటు హాలీవుడ్ లోనూ తనకంటూ సొంత క్రేజ్ క్రియేట్ చేసుకుంటున్నారు. దీంతో గ్లోబల్ స్టార్ గా పునాదులు నిర్మించుకుంటున్నారు.
తాజాగా ధనుష్ నటించిన హాలీవుడ్ ఫిల్మ్ ‘ది గ్రే మాన్’ (The Gray Man) జూలై 22న నెట్ ఫ్లిక్స్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమెరికన్ యాక్షన్ డైరెక్టర్స్ జో రూస్సో బ్రదర్స్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ధనుష్ యాక్షన్ సీక్వెన్స్ ను మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ధనుష్ ‘తిరుచిత్రంబలం, నానే వరువెన్, వాతీ’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాల్లో ప్రస్తుతం Thiruchitrambalam రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఆగస్టు 18న ఈ కామెడీ - డ్రామా ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు భారతీరాజా సీనియర్ తిరుచిత్రంబళం పాత్రను పోషిస్తున్నారు. నిత్యా మీనన్ శోభన పాత్రతో కనిపించనుంది.
