లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం తీయటంతో చంద్రబాబు అభిమానులు ఇప్పటికి మండిపడుతున్నారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం తీయటంతో చంద్రబాబు అభిమానులు ఇప్పటికి మండిపడుతున్నారు. ఆయనపై సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో ఓ రేంజిలో కౌంటర్స్ వేస్తున్నారు. తాజాగా రామ్ గోపాల్ వర్మ బయోపిక్ తీస్తానంటూ చంద్రబాబు వీరాభిమానిగా చెప్పుకునే దేవి బాబు చౌదరి ప్రకటించారు.

దేవి బాబు ఓ యూట్యూబ్ ఛానెల్ తో మాట్లాడుతూ...‘ఎర్రగడ్డకు దారేది’ అనే టైటిల్ పెట్టి రామ్ గోపాల్ వర్మ బయోపిక్ తీస్తానని అన్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చూపించినవి అన్ని అబద్దాలే అని తేల్చి చెప్పారు. వైయస్ జగన్ కోసం లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీసారని, చంద్రబాబు గురించి ఆ సినిమాలో అసత్యాలు ప్రచారం చేసారని మండిపడ్డారు. 

ఈ వీడియోని తెలుగుదేశం అభిమానులు సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఇక కొంతకాలంగా దేవి బాబు చౌదరి డైరక్ట్ గా రామ్ గోపాల్ వర్మకు ఛాలెంజ్ లు విసురుతున్నారు. తనతో డిబేట్ కు రమ్మనమని చెప్తున్నారు. అయితే వర్మ..ఇలాంటివి పట్టించుకుంటాడా అనేదే సందేహం.

ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ విషయానికి వస్తే.. మే 1న ఏపీలో సినిమా విడుదల చేయాలని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రయత్నాలు చేశారు. కానీ అక్కడ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందను సినిమాను రిలీజ్ చేయటం కుదరదని అధికారులు తెలిపారు. దీనిపై వర్మ పెద్ద యుద్దమే చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఏపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు.