బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ ఎవరనే దానిపై చర్చ మొదలైంది. ఇప్పటికే కొంత మంది ప్రముఖులు విన్నర్‌ అతనే అంటూ పలు పేర్లు చెబుతున్నారు. బిగ్‌బాస్‌2 విన్నర్‌ కౌశల్‌.. ఈ సీజన్‌ విన్నర్‌ అభిజిత్‌ విన్నర్‌ అని చెప్పేశాడు. బిగ్‌బాస్‌ 3 విన్నర్ రాహుల్‌ సింప్లిగంజ్‌ సైతం అభిజీత్‌కే నా ఓటు అన్నాడు. మరికొంత మంది విశ్లేషకులు అభిజీత్‌, లాస్యల మధ్య పోటీ ఉంటుందని, వీరిద్దరిలో ఒకరు విన్నర్‌ అని అంటున్నారు. 

ఈ నేపథ్యంలో బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ విన్నర్‌ ని తేల్చేసింది గూగుల్‌ మాత. ఈ సీజన్‌ విన్నర్‌ అభిజీత్‌ అని చెప్పింది. గూగుల్‌ సెర్చ్ లో బిగ్‌బాస్‌4 తెలుగు టైటిల్‌ విన్నర్‌ అని కొట్టగా.. అందులో అభిజీత్‌ పేరుని ఖరారు చేసింది. తాజాగా ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అయితే ఈ విన్నర్‌ పేరు అంటూ వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో గూగుల్‌ సరిచేసుకుంది. లిస్ట్ లో నుంచి అభిజీత్‌ పేరుని తొలగించారు. 

ఇదిలా ఉంటే అభిజీత్‌పై గేమ్‌ విషయంలో విమర్శలున్నాయి. ఆయన కాస్త లేజీగా ఉంటారని, గేమ్స్ ఆడటం లేదనే విమర్శలు వస్తున్నాయి. మొన్న నామినేషన్‌లో కూడా సభ్యులంతా గేమ్‌ సరిగా ఆడటం లేదనే నామినేట్‌ చేశారు. గరిష్టంగా ఆయనకే నాలుగు నామినేషన్లు వచ్చాయి. దీంతో అభిజీత్‌ ఆటపై ఆందోళన నెలకొంది ఆయన అభిమానుల్లో. అంతేకాదు కాస్త నెగటివ్‌ ప్రచారం కూడా పెరిగింది. మరి దీన్ని అభిజీత్‌ ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారనేది చూడాలి. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం షో పదకొండో వారం పూర్తి కావస్తుంది. ఈ వారం ఓ కంటెస్టెంట్‌ వెళ్ళిపోనున్నారు. ఇక మిగిలింది ఏడుగురు ఉంటారు. మరో నాలుగు వారాలు షో రన్‌ కానుంది. దీంతో షోపై మరింత ఉత్కంఠ నెలకొంది. అయితే ఫైనల్‌ విన్నర్‌ని నిర్ణయించేది ఆడియెన్సే అయినా, అది బిగ్‌బాస్‌ ప్లానింగ్‌ ప్రకారమే సాగుతుందని, అదంతా ఓ స్ట్రాటజీ ప్రకారం సాగుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఏం జరగబోతుందనేది మున్ముందు చూడాలి.