బిగ్‌బాస్‌ 4 టాప్‌ 3లో ఉన్న కంటెస్టెంట్‌ సోహైల్‌ ఫైనల్‌ రోజే అసలైన విన్నర్‌గా నిలిచారు. బిగ్‌బాస్‌ ఇచ్చిన 25 లక్షల ఆఫర్‌ని తీసుకుని పర్సనల్‌గా జాక్‌పాట్‌ కొట్టడంతోపాటు వేదికపై నాగార్జున, చిరంజీవి వంటి బిగ్‌ స్టార్స్ మనసులను గెలుచుకున్నాడు. అంతిమంగా అందరి హార్ట్ లను కొల్లగొట్టాడు. సోహైల్‌ పది లక్షలు ఇవ్వాలనుకున్న ఆర్ఫనేజ్‌కి తాను ఇస్తానని నాగార్జున తెలిపారు. అంతేకాదు అందరి ముందు వేదికపై సోహైల్‌ని నాగార్జున ఎత్తుకోవడం హైలైట్‌గా నిలిచింది. 

ఆ తర్వాత సోహైల్‌ సినిమా తీస్తానంటే అందుకు తాను సపోర్ట్ చేస్తానని చిరంజీవి చెప్పారు. ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ తానే నిర్వహిస్తానన్నాడు. అంతేకాదు చిన్న కోమియో కూడా పెడితే తాను ఫ్రీ నటిస్తానని చెప్పాడు. అంతటితో ఆయిపోలేదు. బ్రహ్మానందం తన సినిమాలో నటిస్తానని స్వయంగా చెప్పాడు. దీంతో సోహైల్‌ ట్రోఫీ గెలవలేకపోయిన అందరి మనసులను గెలుచుకున్నాడు. అసలైన విన్నర్‌గా నిలిచాడు. 

హౌజ్‌ నుంచి బయటకు వచ్చాక సోహైల్‌కి చాలా సినీ ఆఫర్స్ వస్తున్నాయి. రావడం మాటేమోగానీ ఇప్పుడు ఏకంగా ఓ సినిమా అనౌన్స్ మెంట్‌ కూడా జరిగింది. `జార్జిరెడ్డి`, `ప్రెజర్‌ కుక్కర్‌` వంటి సినిమాలను నిర్మించిన అప్పిరెడ్డి.. సోహైల్‌ హీరోగా ఓ సినిమాని గురువారం ప్రకటించారు. దీనికి శ్రీనివాస్‌ వింజనంపతి అనే కొత్త దర్శకుడు డైరెక్షన్‌ చేయబోతున్నారు. మైక్‌ మూవీస్‌ పతాకంపై భారీ లెవల్‌లో ఈ సినిమాని తెరకెక్కించనున్నారట. బిగ్‌బాస్‌తో వచ్చిన క్రేజ్‌ని ఈ సినిమాతో క్యాష్‌ చేసుకోవాలని చూస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.