బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో అరుదైన కంటెస్టెంట్‌ గంగవ్వ. అరవై ఏళ్ళకుపైగా వయసులోనూ ఇంటి సభ్యురాలిగా ఎంపిక కావడం విశేషం. దీంతో ఈ సీజన్‌లో గంగవ్వే హైలైట్‌ అయ్యారు. తెలంగాణ యాసతో యూట్యూబ్‌లో స్టార్‌ అయిన గంగవ్వ ప్రారంభంలో ఆకట్టుకుంది. సందడి చేసింది. కానీ క్రమంగా డల్‌ అవుతూ వస్తున్నారు. పదకొండో రోజు ఏకంగా అనారోగ్యానికి గురయ్యారు. 

దీంతో ఆమెని బిగ్‌బాస్‌ పిలిపించి మాట్లాడారు. గంగవ్వ ఇక్కడి వాతావరణం పడటం లేదని స్పష్టం చేసింది. అందరు తనని బాగా చూసుకుంటున్నారుగానీ, తన ఆరోగ్యమే బాగుండటం లేదన్నారు. ఈ సందర్బంగా తన గతం చెప్పుకుంటూ బిగ్‌బాస్‌ ముందు కన్నీళ్ళు పెట్టుకుంది. తనని నాన్నే పెంచాడని, అక్కా చెల్లెల్లు లేరని, ఒంటరిగా పెరిగానని తెలిపింది. 

చిన్నప్పుడు ఎంతో కష్టం చేశానని, బండరాళ్లని కొట్టానని చెప్పి అందరి చేత కన్నీళ్ళు పెట్టించింది. చిన్నప్పట్నుంచి కష్టం చేయడం వల్ల తనకు రెస్ట్ లేదని, దీంతో తన భర్త కొట్టిన దెబ్బలు ఇప్పుడు నొప్పులు పెడుతున్నాయని వాపోయింది. దీనిపై బిగ్‌బాస్‌ స్పందిస్తూ తాను పడ్డ కష్టాల కింద ఇదిపెద్ద లెక్క కాదని, తనది గట్టి శరీరం అని దేన్నైనా తట్టుకుంటుందని ధైర్యం చెప్పారు. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. బిగ్‌బాస్‌ అన్ని చూసుకుంటాడని, వైద్యులు చూసుకుంటారని తెలిపాడు. త్వరలోనే గంగవ్వ పూర్తి ఆరోగ్యవంతురాలు అవుతుందని బిగ్‌బాస్‌ నమ్ముతున్నట్టు తెలిపారు. 

బిగ్‌బాస్‌ ఇచ్చిన ధైర్యంతో హౌజ్‌లోకి వెళ్ళిన గంగవ్వని అందరూ బాగా చూసుకున్నారు. ఆమె విషయంలో ఎమోషనల్‌ అయ్యారు. ఆ వెంటనే బిగ్‌బాస్‌ ఆమెని మెడికల్‌ రూమ్‌కి తీసుకు రావాలని లాస్యకి ఆదేశించారు. ఆమె గంగవ్వని తీసుకుని మెడికల్‌ రూమ్‌కి తీసుకెళ్ళారు. అయితే అక్కడ గంగవ్వకి కరోనా పరీక్షలు చేసినట్టు తెలుస్తుంది.  షోకి పనిచేసే కొంత మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందట. టెక్నీషియ‌న్ల‌కు క‌రోనా రావడంతో ముందు జాగ్ర‌త్త‌గా గంగ‌వ్వ‌కు కూడా ప‌రీక్ష చేయించార‌ట‌. ఆ ఫలితాల కోసం వెయిట్‌ చేస్తున్నారట. ఇప్పుడు గంగవ్వకి పాటిజివ్‌ వస్తే పరిస్థితేంటి? అనే ఆందోళన ఇప్పుడు అందరిని వెంటాడుతుంది. అయితే గంగవ్వని ఉంచుతారా? పంపిస్తారా? అన్నసస్పెన్స్ నెలకొంది.