బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ మూడో వారం పెద్ద హైడ్రామా నడుస్తుంది. మూడో వారంలో కొత్త గేమ్‌ స్టార్ట్ అయ్యింది. రోబో టీమ్‌, మనుషుల టీమ్‌ మధ్య గేమ్‌ టాస్క్ జరిగింది. ఈ క్రమంలో రెండు టీమ్‌ ల మధ్య పెద్ద గొడవే జరిగింది. 

కొత్త గేమ్‌ మాస్‌ మహారాజాగా మారింది. ఇప్పటి వరకు కూల్ గా సందడి చేసిన గంగవ్వ విశ్వరూపం చూపించింది. షో మొదలైన తర్వాత తొలిసారి అవ్వ టాస్కులో పాల్గొంది. రోబోల ప్రాణాలు కాపాడటానికి మనుషులను మోసం చేసింది. మనుషుల టీమ్‌పైకి ఛైర్‌ కూడా విసిరింది. గంగవ్వలో ఇంత ఫైర్‌ చూసి సభ్యులంతా షాక్‌ అయ్యారు. 

గంగవ్వ రెచ్చిపోవడంతో మోనాల్‌ కూడా రెచ్చిపోయింది. రూమ్‌లోకి వెళ్ళకుండా అరియానాని నెట్టివేసింది. సుజాత కూడా అరియానాని ఛార్జింగ్‌ పెట్టుకోనివ్వకుండా నెట్టివేసింది. మరోవైపు మోనాల్‌, లాస్య మధ్య తోపులాటలో ఇద్దరూ పడిపోయారు. ఇందులో మోనల్‌కి దెబ్బతగలింది. 

ఇక గంగవ్వ రోబో డ్రెస్ తీసుకుని మోనాల్ లోపలికి విసరడంతో ఒక్కసారిగా సీరియస్ అయిపోయింది గంగవ్వ. తన డ్రెస్‌తో నీకేంటి పని అంటూ మండి పడింది. అంతేకాదు పక్కనే ఉన్న కుర్చీ తీసుకుని మోనాల్ గజ్జర్‌పైకి విసిరేసింది. దీంతో వాళ్ళంగా షాక్‌ అయ్యారు. ఆమెలో ఇన్ని షేడ్స్ ఉన్నాయిరా నాయనా అంటూ నవ్వుకుంటున్నారు మిగిలిన ఇంటి సభ్యులు. 

మరోవైపు మనుషుల టీమ్‌ని మోసం చేసి అవినాష్‌ ఛార్జింగ్‌ పెట్టుకున్నారు. అమ్మ రాజశేఖర్‌ వద్ద సైలెంట్‌గా ఉండి తను ఒక పాయింట్‌ ఛార్జింగ్‌ పెట్టుకున్నాడు. మరోవైపు మెహబూబ్, సోహైల్ ఓవర్ యాక్షన్‌ కూడా హైలైట్ అయింది. దానికితోడు అరియానా సోలో గేమ్‌ ప్లాన్‌,  గంగవ్వ, అభిజిత్‌ ఇంటిలిజెన్స్ అన్నీ బాగానే వర్కవుట్ అయ్యాయి. ఇందులో భాగంగానే మోనాల్ గజ్జర్ కూడా రోబోల టీంతో గొడవ పడి హైలైట్‌ అయ్యింది. 

అయితే తనని మోసం చేయడంతో అమ్మ రాజశేఖర్‌ మండిపడ్డారు. లైఫ్‌ లో ఇంకెప్పుడు నమ్మను అని చెప్పేశాడు. ఆయన పెళ్ళి చేసుకునే అమ్మాయిని కూడా నమ్మని అని తెలిపాడు. మరోవైపు గంగవ్వని అవినాష్‌ ముద్దు అడిగాడు. ఛాన్స్ మిస్‌ చేసుకోకు అన్నాడు. అందుకు గంగవ్వ ఛీ పో అంటూ తిట్టింది(సరదాగా). 

ఇక ఒక్కో దెయ్యం గేమ్‌లో రోబో టీమ్‌ నుంచి అభిజిత్‌, గంగవ్వ ఛార్జింగ్‌తో ఉండటంతో వీరి విజయం సాధించారు. అలాగే మనుషుల టీమ్‌ కూడా బాగా పర్‌ఫెర్మ్ చేసిందని బిగ్‌బాస్‌ అబినందించారు. 

ఈ గేమ్‌లో బెస్ట్‌ పర్‌ఫార్మ్ చేసిన వారిలో గంగవ్వ, అవినాష్‌, అభిజిత్‌, హారిక ప్రశంసలందుకుని ఈ సారి టీమ్‌ లీడర్‌ పోటీలో ఉన్నారు. ఇక వరస్ట్ గేమ్‌తో నోయల్‌ జైలుకి వెళ్ళారు. ఇక ట్విస్ట్ ఏంటంటే జైల్లో ఉన్నన్ని రోజులు ఆయనకు ఎవరూ ఎలాంటి ఫుడ్‌ అందించకూడదని బిగ్‌బాస్‌ ఆదేశించారు. దీంతో సీన్‌ రసవత్తరంగా మారింది.