బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్ సోహైల్ హీరోగా సినిమాని ప్రకటించారు. మరోవైపు బిగ్‌బాస్4 విన్నర్ అభిజిత్ సైతం హీరోగా సినిమాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. తాజాగా బిగ్‌బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ హీరోగా సినిమాని ప్రకటించి ఆశ్చర్యానికి గురి చేశాడు.
బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ హీరోగా రాణిస్తున్న సందర్భాలు చాలా తక్కువ. ఇప్పుడిప్పుడే ఆ దిశగా వారికి అవకాశాలు వస్తున్నాయి. బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్ సోహైల్ హీరోగా సినిమాని ప్రకటించారు. మరోవైపు బిగ్‌బాస్4 విన్నర్ అభిజిత్ సైతం హీరోగా సినిమాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. తాజాగా బిగ్‌బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ హీరోగా సినిమాని ప్రకటించి ఆశ్చర్యానికి గురి చేశాడు. `చిచ్చా` పేరుతో రూపొందుతున్నీ చిత్రాన్ని ప్రకటిస్తూ టైటిల్ సాంగ్‌ని విడుదల చేశారు. తెలంగాణ యాసతో సాగే ఈ పాట ఆకట్టుకుంటుంది.
ఆర్.ఎస్. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఆయన హీరోగా మల్లిక్ కందుకూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి సంబంధించిన సినిమా టైటిల్ మరియు మోషన్ పోస్టర్‌ని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి. హరీష్ రావు సిద్దిపేటలో లాంచ్ చేశారు. ఇటీవల రాహుల్ సిప్లిగంజ్ అతని మిత్రుడు శ్రీకాంత్ ఇద్దరు కలిసి క్రియేట్ చేసిన 'ఊకో కాకా' (మెన్స్ వేర్) బ్రాండ్ స్టోర్‌ని మంత్రి హరీష్ రావు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక 'చిచ్చా' టైటిల్ సాంగ్ ని రాహుల్ సిప్లిగంజ్ అభిమానులు విడుదల చేయడం గమనార్హం. మరోవైపు రాహుల్ సిప్లిగంజ్ సింగర్‌గానూ రాణిస్తున్న విషయం తెలిసిందే.
