గురువారం లగ్జరీ బడ్జెట్‌ టాస్క్ లో భాగంగా దెయ్యం పేరుతో టాస్క్ లు ఇంటి సభ్యులను ఆడుకున్నాడు బిగ్‌బాస్. దెయ్యం జలజా ఇంటి సభ్యులకు రకరకాల గేమ్‌లతో  ఇబ్బంది పెట్టింది. మరోవైపు అభిజిత్‌కి ఫనిష్‌మెంట్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. 

హౌజ్‌లో ఆయన ఎప్పుడూ ఇంగ్లీష్‌ మాట్లాడుతూ బిగ్‌బాస్‌కి దొరికిపోతుంటాడు. ఆయనకు చాలా సార్లు ఫనిష్‌మెంట్‌ ఇస్తూనే ఉన్నారు. అయినా మారలేదు. మళ్ళీ ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతున్నాడు. గురువారం ఎపిసోడ్‌లో ఆయన మరోసారి ఇంగ్లీష్‌లో మాట్లాడాడు. అరియానాతో, అభిజిత్‌ తమ రిలేషన్‌షిప్‌ గురించి చర్చించారు. అయితే ఆయన ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతుండటంతో బిగ్‌బాస్‌ హెచ్చరించాడు. 

ఇక దెయ్యం జలజ మాత్రం తలకిందులుగా ఉండాలని చెప్పింది. `అ..` నుంచి `ఱ..` వరకు చదివించాలని చెప్పారు. దీంతో సభ్యులు ఆయనకు చదివించారు. అరియానా, సోహైల్‌ రెచ్చిపోయి మరీ ఆయనకు తెలుగు పదాలను చదివించారు. బట్టీపట్టించారు.