నటి, హిందీ బిగ్‌బాస్‌ 7 ఫేమ్‌ సోఫియా హయత్‌ షాకింగ్‌ విషయాలను వెల్లడించింది. తాను బిగ్‌బాస్‌ షో చేస్తున్నప్పుడు ఓ ఏజెంట్‌ ఇంటిమేట్‌ ‌(బెడ్‌రూమ్‌)సీన్స్ చేయాలని అభ్యర్థించాడట. 

శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్ర పోర్నోగ్రఫీ కేసు బాలీవుడ్‌లో దుమారం రేపుతుంది. సినిమా, వెబ్‌ సిరీస్‌ అవకాశాలిస్తా అంటూ అమ్మాయిలను, మోడల్స్ కి ఎరవేస్తూ వారిచే పోర్న్ చిత్రాలు రూపొందించారనే ఆరోపణలతో రాజ్‌కుంద్రాని అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. దీంతో అనేక మంది హీరోయిన్లు వెలుగులోకి వస్తున్నారు. రాజ్‌కుంద్రా ఆగడాలపై గొంగెత్తుతున్నారు. మరోవైపు ఇంకొంత మంది తాము అవకాశాల కారణంగా ఎలా పోర్న్ వీడియోలకు బలవుతున్నామో వివరిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో నటి, హిందీ బిగ్‌బాస్‌ 7 ఫేమ్‌ సోఫియా హయత్‌ షాకింగ్‌ విషయాలను వెల్లడించింది. తాను బిగ్‌బాస్‌ షో చేస్తున్నప్పుడు ఓ ఏజెంట్‌ ఇంటిమేట్‌ ‌(బెడ్‌రూమ్‌)సీన్స్ చేయాలని అభ్యర్థించాడట. అంతేకాదు షూటింగ్‌కి ముందే అలాంటి సీన్స్‌ రిహార్సల్స్‌ చేసి వీడియోలు పంపమని కోరాడని ఆరోపించింది. అయితే నిజమైన ప్రొఫెషనల్‌గా శృంగార సన్నివేశాలు చిత్రీకరించే వాళ్లు ఎవరూ ముందుగా అలాంటి సీన్స్‌ చేసి చూపించమని అడగరని చెప్పింది. 

గతంలో సోఫియా కొన్ని హాలీవుడ్ చిత్రాల్లో బెడ్ రూం సీన్స్‌లో నటించింది. దాన్ని ఉద్దేశించి చెబుతూ అప్పుడు ఎవరూ తనని ముందుగా వచ్చి `రిహార్సల్స్` చేయమని అడగలేదని, అందుకే ఆ ఏజెంట్‌ మాటలను తాను నమ్మలేదని సోఫియా వెల్లడించింది. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వాలనుకొనే అమ్మాయిలను కొంతమంది ఏజెట్లు మోసం చేసి, అశ్లీల చిత్రాలలో నటింపజేస్తున్నారని సోఫియా ఆరోపించింది. అవకాశాల పేరుతో పోర్న్‌ వీడియోలు చేయిస్తున్నారని ఫైర్‌ అయ్యింది. ఇలా అమ్మాయిలను మోసం చేసి అశ్లీల సినిమాల్లో నటించేలా చేయడం అత్యాచారంతో సమానమని, అలాంటి వారి పట్ల కోర్టులు కఠినంగా వ్యవహరించాలని సోఫియా వెల్లడించింది.