నాగార్జున అందరిని అప్రిషియేట్‌ చేశారు. ఫస్ట్ వీక్‌ కాబట్టి వాళ్లకి కాస్త టైమ్‌ ఇద్దామని ఏమనకుండా వదిలేశాడు. అయితే ఒక్కొక్కరిని ఆయన అభినందించారు. ఇక ఎవరితో సెట్‌, ఎవరితో కట్‌ గేమ్‌లో అందరు తమకి కనెక్ట్ అయిన వారిని, కనెక్ట్ కాని వారిని చెప్పారు.

బిగ్‌బాస్‌5 మొదటి వారాంతం చేరుకుంది. నాగార్జున ఎంట్రీ అందరిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే శనివారం నాగ్‌ క్లాస్‌ ఉంటుందని ముందే గ్రహించిన కంటెస్టెంట్స్ తమ మిస్టేక్స్ ని, ఇతర సభ్యులతో ఉన్న విభేదాలు సెట్‌ చేసుకునే పనిలో పడ్డారు. ఉమాదేవితో ఉన్న గొడవని ప్రియాంక సెట్‌ చేసుకోగా, జెస్సీ సైతం తన వివాదాల విషయంలో రియలైజ్‌ అయ్యారు. ఎవరికి వారు సెట్‌ చేసుకునేపనిలో పడ్డారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇక నాగార్జున అందరిని అప్రిషియేట్‌ చేశారు. ఫస్ట్ వీక్‌ కాబట్టి వాళ్లకి కాస్త టైమ్‌ ఇద్దామని ఏమనకుండా వదిలేశాడు. అయితే ఒక్కొక్కరిని ఆయన అభినందించారు. ఇక ఎవరితో సెట్‌, ఎవరితో కట్‌ గేమ్‌లో అందరు తమకి కనెక్ట్ అయిన వారిని, కనెక్ట్ కాని వారిని చెప్పారు. అందులో భాగంగా లోబో ఫస్ట్ టైమ్‌ కన్నీళ్లు పెట్టుకున్నాడు. హౌజ్‌లో బెస్ట్ ఎంటర్‌టైనర్‌గా నాగార్జున చేత ప్రశంసలందుకున్నారు లోబో. సెట్‌, కట్‌ గేమ్‌లో.. షణ్ముఖ్‌తో కనెక్ట్ అయ్యిందన్నారు. 

తనకు తండ్రి లేడని, తన తండ్రి లాగా షణ్ముఖ్‌ చెప్పాడని చెబుతూ ఎమోషనల్‌ అయ్యాడు లోబో. లోబో అలా కన్నీళ్లు పెట్టడం అందరిని కలచి వేసింది. అంతేకాదు సిరి సైతం తనకు చాలా విషయాలు నేర్పిస్తుంటాడని షణ్ముఖ్‌తో కనెక్ట్ ఇచ్చింది. అదే సరయు తనని కెప్టెన్‌ టాస్క్ విషయంలో విమర్శించినందుకు తనకు నచ్చలేదని ఆమెతో కట్‌ చెప్పింది. మరోవైపు స్వేత సైతం అని మాస్టర్‌ తనని అమ్మలా చూసుకుంటుందని చెప్పి ఎమోషనల్‌ అయ్యింది.