Asianet News TeluguAsianet News Telugu

ఇంటి సభ్యుల గ్రూప్‌ రాజకీయాలు.. సన్నీ చేసిన పనికి వాయించేసిన సిరి.. టాస్క్ లో పడిపోయిన లోబో..

దాన్నుంచి బయటపడేందుకు మంగళవారం(9వ రోజు) ఇంటి సభ్యులు ప్రయత్నిస్తున్నారు. నటరాజ్‌ మాస్టర్‌తో యాంకర్‌ రవి ఆయన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. మరోవైపు లోబోతో మానస్‌ తన మధ్య ఉన్న విభేదాలను సెట్‌ చేసుకునే పనిలో పడ్డారు. స్వేతని ఓదార్చింది ప్రియాంక సింగ్‌.

biggbos5 9th day roundup siri fire on sunny and lobo went medical room
Author
Hyderabad, First Published Sep 15, 2021, 12:02 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బిగ్‌బాస్‌5 మొదటి వారం కూల్‌గా సాగినా రెండో వారం మాత్రం రసవత్తరంగా సాగుతుంది. ఎలిమినేషన్‌ ప్రక్రియతో ఈ హీటు స్టార్ట్ అయ్యింది. మొదటి ఎలిమినేటర్‌ సరయు వెళ్తూ వెళ్తూ అనేక ఆరోపణలు, సంచలన కామెంట్లు చేసింది. ఇక రెండో వారంలో నామినేషన్ల ప్రక్రియలోనూ స్వేత వర్మ, ఉమాదేవి రెచ్చిపోయారు. వీరితోపాటు లోబో, నటరాజ్‌ మాస్టర్‌, అనీ మాస్టర్లు ఫైర్‌ అయ్యారు. మొత్తంగా నామినేషన్ల ప్రక్రియ హౌజ్‌లో ఒక్కసారిగా వేడిని పెంచేసింది. 

దాన్నుంచి బయటపడేందుకు మంగళవారం(9వ రోజు) ఇంటి సభ్యులు ప్రయత్నిస్తున్నారు. నటరాజ్‌ మాస్టర్‌తో యాంకర్‌ రవి ఆయన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. మరోవైపు లోబోతో మానస్‌ తన మధ్య ఉన్న విభేదాలను సెట్‌ చేసుకునే పనిలో పడ్డారు. స్వేతని ఓదార్చింది ప్రియాంక సింగ్‌. ఉమాదేవి లాంగ్వేజ్‌ పట్ల మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది స్వేత వర్మ. అలాగే సిరి,రవి,లహరి గుసగుసలు స్టార్ట్ చేశారు. నటరాజ్‌ మాస్టర్ గురించి చెప్పారు రవి. 

జెస్సీ, శ్రీరామచంద్ర సైతం మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. అలాగే ప్రియా, ఉమాదేవి తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉమాదేవి మాట తీరుని మార్చుకోవాలని సన్నీ సూచించాడు. ఇలా అందరు గ్రూపులుగా విడిపోయి ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. గ్రూప్‌ రాజకీయాలకు తెరలేపారు. 

ఈ క్రమంలోనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్‌.9వ రోజు హౌజ్‌లో కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్‌. నిన్నటి(సోమవారం) విభజించినట్టుగానే రెండు టీమ్‌లు ఇందులో పాల్గొనాల్సి ఉంది. ఈగల్‌ టీమ్‌కి శ్రీరామచంద్ర సంచాలకుడిగా వ్యవహరించగా, వోల్ఫ్‌ టీమ్‌కి మానస్‌ సంచాలకులుగా ఉన్నారు. ఇందులో తమ టీమ్‌ సింబల్‌కి చెందిన ఫ్లాగ్‌లను ఎక్కువగా సంపాదించిన వాళ్లు విన్నర్‌గా ఉంటారని, విన్నర్‌కి ఫ్లాగ్‌ దక్కుతుందని చెప్పారు బిగ్‌బా. ఈ టాస్క్ లో రెండు జట్లు రెచ్చిపోయాయి ఆడాయి. ఒకరిపై ఒకరు పడ్డారు, కొట్టుకున్నారు, లాక్కున్నారు. నానా హంగామా చేశారు. డైరెక్ట్ గా కొట్టుకునే స్టేజ్‌కి వెళ్లారు. 

అయితే అందులో భాగంగా `దొంగలున్నారు జాగ్రత్త` టాస్క్ లో హోరా హోరీగా గేమ్‌ ఆడారు. అయితే ఇందులో వోల్ఫ్‌ టీమ్‌ సభ్యులు మీద పడటంతో ఉక్కిరి బిక్కిరయ్యాడు లోబో. ఆయన పడిపోయాడు. దీంతో ఆయన్ని మెడికల్‌ రూమ్‌కి పంపించి ట్రీట్‌మెంట్‌ అందించారు. ఈ విషయంపై ఇంటి సభ్యులు, రెండు గ్రూపుల వారు ఒకరిపై ఒకరు మండిపడ్డారు. ఇదే విషయంలో ఇంట్లో ఎంతో క్లోజ్‌గా మూవ్‌ అవుతున్న విశ్వ, రవిల మధ్య కూడా పెద్ద గొడవకి దారి తీసింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. ఆ తర్వాత దాన్నిసాల్వ్ చేసుకున్నారు. 

అయితే ఈగల్‌ టీమ్‌లోని సిరి నుంచి ఫ్లాగ్‌ని లాక్కునేందుకు సన్నీ అమ్మాయిల టీషర్ట్ లో చేయి పెట్టారని ఆరోపించింది సిరి. ఇది పెద్ద వివాదానికి దారి తీసింది. దీనిపై షణ్ముఖ్‌ అసహనం వ్యక్తం చేశాడు. ఇదే విషయంలో లహరి ఒకవైపు, సన్నీ మరోవైపు భోరున విలపించారు. మొత్తంగా 9వ రోజు షో ఆద్యంతం రసవత్తరంగా సాగింది. అదే సమయంలో హద్దులు దాటిపోతుందనే సిగ్నల్స్ ని ఇస్తుంది. ఇంటి సభ్యులు పర్సనల్‌గా తీసుకుని గేమ్‌ ఆడటం, ఎథిక్స్ వదిలేసి గేమ్‌ ఆడుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంత దూరం వెళ్తుందో చూడాలి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios